Breaking News

కౌన్సిలర్ ఎన్నికల బరిలో ఉగ్రవాది

Published on Tue, 02/10/2026 - 04:42

బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌లో రాబోయే మే నెలలో నగర కౌన్సిలర్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇందులో ఓ ఉగ్రవాది పోటీ చేస్తుండటం షాకింగ్‌గా అనిపిస్తోంది. 1999లో యెమెన్‌లోని బ్రిటీష్ కాన్సులేట్, ఓ మసీదు, స్విస్ హోటల్‌పై బాంబు దాడులు జరగ్గా.. వీటిలో భాగమైన షాహిద్ భట్ దోషిగా తేలాడు. ఉగ్రవాద సంఘాలతో సంబంధాలు కారణంగా జైలుశిక్ష అనుభవించాడు.

ఉగ్రవాది అబూ హమ్జాకు గతంలో అనుచరుడిగా ఉన్న భట్.. అప్పట్లోనే అఫ్ధానిస్తాన్, బోస్నియా, తర్వాత యెమెన్‌కు వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే తనపై వచ్చిన విమర్శలను షాహిద్ ఖండించాడు. బర్మింగ్‌హామ్ కౌన్సిలర్ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై తనని తాను సమర్థించుకున్నాడు.

యెమెన్ కోర్టులో తప్పుడు వాంగ్మూలాల ఆధారంగా నాకు శిక్ష విధించారు. కౌన్సిలర్ ఎన్నికల్లో నాకే ఓటేయాలని ఎవరినీ బలవంతం చేయను. నచ్చకపోతే నాకు ఓటు వేయొద్దు అని షాహిద్ భట్ క్లారిటీ ఇచ్చాడు. 

షాహిద్ భట్.. ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూటమి తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. దీనికి అఖ్మద్ యాకుబ్, షకీల్ అఫ్జర్ నాయకత్వం వహిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గాజా, పాలస్తీనా అంశాలపై లేబర్ పార్టీ వైఖరితో అసంతృప్తిగా ఉన్న ఓటర్లపై ఈ కూటమి ప్రభావం చూపగలదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే కౌన్సిల్ ఎన్నికల్లో లేబర్ పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకుని ఈ స్వతంత్ర అభ్యర్థులు దెబ్బతీయగలదని అంచనా వేస్తున్నారు.

బ్రిటన్ చట్టాల ప్రకారం, విదేశాల్లో లేదా దశాబ్దాల క్రితం జరిగిన నేరాల్లో శిక్ష అనుభవించినవారికి కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఉన్నాయి. ఈ నిబంధనలు భట్‌కు అనుకూలంగా మారాయి. ఈ వ్యవహారంపై ప్రముఖ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. లేబర్ ఎంపీ జెస్ ఫిలిప్స్ మాట్లాడుతూ.. ఉగ్రవాద దోషిగా తేలిన వ్యక్తి ప్రజాప్రతినిధిగా పోటీపడటం అత్యంత దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)