Breaking News

ఖలిస్థానీల హెచ్చరిక.. భారత కాన్సులేట్‌ను సీజ్‌ చేస్తామంటూ..

Published on Wed, 09/17/2025 - 09:06

ఒట్టావా: కెనడాలోని ఖలిస్థానీ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయి అనుచిత వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను టార్గెట్‌ చేసి వాంకోవర్‌లోని భారత కాన్సులేట్‌ను సీజ్‌ చేస్తామని తాజాగా బెదిరింపులకు దిగారు. ఈ మేరకు ఖలిస్థానీ సిక్స్‌ ఫర్‌ జస్టిస్ (SFJ) సంస్థ హెచ్చరించింది. దీంతో, ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది.

వివరాల ప్రకారం.. భారత్‌, కెనడా మధ్య మళ్లీ దౌత్య సంబంధాలు తిరిగి ప్రారంభమవుతున్న వేళ కెనడాలోని ఖలిస్థానీలు రెచ్చిపోయారు. అమెరికాకు చెందిన ఖలిస్థానీ సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్.. వాంకోవర్‌లోని భారత కాన్సులేట్‌ను ముట్టడిస్తామని పేర్కొంది. ఈనెల 18న (గురువారం) దీన్ని స్వాధీనం చేసుకుంటామని, ఆ సమయంలో ఇక్కడికి ఎవరూ రావొద్దంటూ హెచ్చరికలు చేసింది. ఇదే సమయంలో కాన్సులేట్‌కు వచ్చే వారు తన సందర్శనను వాయిదా వేసుకోవాలని సూచించింది.

ఈ సందర్భంగా భారత హైకమిషనర్‌ దినేశ్ కె.పట్నాయక్‌ను లక్ష్యంగా చేసుకుని ఉన్న పోస్టర్లను కూడా విడుదల చేసింది. అంతటితో ఆగకుండా.. భారత కాన్సులేట్‌లు గూఢచారి నెట్‌వర్క్‌ను నడుపుతున్నాయని, ఖలిస్థానీలను లక్ష్యంగా చేసుకుని నిఘా పెట్టాయని ఆ బృందం ఆరోపించింది. దీంతో ఇది కాస్తా తీవ్ర కలకలం రేపింది. ఇదిలా ఉండగా.. రెండు సంవత్సరాల క్రితం 18 సెప్టెంబర్ 2023న హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర దర్యాప్తులో ఉందని అప్పటి ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో, నాటి నుంచి భారత్‌, కెనడా మధ్య దౌత్యపరంగా విభేదాలు వచ్చాయి. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)