Breaking News

ఇంటర్నెట్‌పై ఇరాన్ కీలక నిర్ణయం

Published on Sat, 01/03/2026 - 19:55

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడి ఇంటర్నెట్ వినియోగం భారీ స్థాయిలో తగ్గినట్లు అక్కడి నివేదికలు తెలుపుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే ఇంటర్నెట్, సోషల్ మీడియాలపై కఠిన ఆంక్షలు విధించిన దేశాల్లో ఇరాన్ టాఫ్ ప్లేసులో ఉందని  అక్కడి సర్వేలు పేర్కొన్నాయి.

ఇరాన్‌లో ప్రస్తుతం ఆర్థికసంక్షోభం, అధిక ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ పతనం, మానవహక్కుల ఉల్లంఘన తదితర కారణాలతో అక్కడి ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. దీంతో పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఇంటర్నెట్ వాడకంపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. సోషల్ మీడియాలతో పాటు ఇతర సాధనాలపై బ్యాన్ విధించింది.

దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు ఉండడంతో ప్రధాన సోషల్ మీడియా సాధనాలైన యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ తదితర వాటిపై పూర్తిస్థాయిలో నిషేదం విధించింది. ‍అదే ఇరాన్- ఇజ్రాయెల్ ఘర్షణ సమయంలో దాదాపు పూర్తి స్థాయిలో దాదాపు 90 నుంచి 97శాతం ఇంటర్నెట్ సేవలను బ్యాన్ చేసింది. అంతేకాకుండా ఇంటర్నెట్‌లో వచ్చే ప్రతి కంటెంట్‌పై అక్కడి ప్రభుత్వం ప్రత్యేక నిఘా ఉంచింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న కంటెంట్‌లను ప్రసారం కాకుండా  ఆంక్షలు విధించింది.

డిజిటల్ అపార్థైడ్ 

అంతేకాకుండా ఇరాన్‌లో ఇప్పుడు అనుమతి ఉన్న వ్యక్తులు, సంస్థలకు మాత్రమే వైట్ సిమ్ కార్డులు ఇస్తున్నారు. ఇవి ఉన్న వ్యక్తులు మాత్రమే ఇంటర్నెట్‌కు ఎటువంటి అంతరాయం లేకుండా సేవలు పొందగలరు. సాధారణ ప్రజలకు ఇంటర్నెట్ వాడకంపై కొన్ని పరిమితులు కల్పించబడ్డాయి. దీంతో ఈనియమంపై అక్కడ దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి.

ఇలా నిరంతరంగా ఇంటర్నెట్‌ సేవలపై ఆంక్షలు విధించడంతో ఆదేశ ఎకానమీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం డిజిటల్ ఎకానమీ ట్రెండ్ నడస్తున్న నేపథ్యంలో రోజువారీ దైనందిన అవసరాలకు ఇంటర్నెట్ అవసరమైన నేపథ్యంలో  ఆంక్షలు నేపథ్యంలో ఎకానమీపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

అంతేకాకుండా ప్రభుత్వం నేషనల్ ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్ ద్వారా  గ్లోబల్ ఇంటర్నెట్ వ్యవస్థ నుండి దేశాన్ని వేరుచేసి ఇరాన్‌కు చెందిన ప్రత్యేక ఇంటర్నెట్ వ్యవస్థను సృష్టించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

#

Tags : 1

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)