Breaking News

తండ్రి మృతిని తట్టు​కోలేని చిన్నారి.. సమాధి దగ్గరకు వెళ్లి..

Published on Tue, 07/04/2023 - 13:01

ఆ చిన్నారి తన ఏడేళ్ల వయసులో తండ్రిని కోల్పోయింది. ఆమె తండ్రి వలస కూలీ. ఆ బాలికకు చెందిన ఒక వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ చిన్నారి తన తండ్రి సమాధి దగ్గర కూర్చుని తండ్రికి కథలు వినిపిస్తోంది. ఈ ఉదంతం చైనాలోని హెనాన్‌ ప్రాంతానికి చెందినది. ఆ బాలిక పేరు లిన్‌ లీ. ఆ బాలిక తండ్రి గత ఏడాది చేపలు పడుతూ నీట మునిగి మరణించాడు. 

తండ్రి సమాధి దగ్గరకు వెళ్లి..
సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్టు అందించిన రిపోర్టులోని వివరాల ప్రకారం.. ఆ బాలిక తన అత్తతో గత రాత్రి తనకు తండ్రి కనిపించాడని తెలిపింది. తరువాత తనను తండ్రి సమాధి దగ్గరకు తీసుకువెళ్లాలని మొండిపట్టు పట్టింది. ఆ బాలిక తండ్రి వారి ఇంటికి వెయ్యి కిలో మీటర్ల దూరంలో పనిచేస్తుండేవాడు. అతను ఇంటికి వచ్చినప్పడు పుస్తకాలు చదువుతూ, తన కుమార్తెకు కథలు చెప్పేవాడు. తండ్రి చనిపోయిన తరువాత ఆ చిన్నారి మామ్మతో ఉంటోంది. ఇంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆమె తల్లి ఎప్పుడో ఇంటి నుంచి వెళ్లిపోయింది. 

సోషల్‌ మీడియాలో వైరల్‌
తల్లి దూరమై, తండ్రి చనిపోవడంతో ఆ చిన్నారి అనాథగా మారింది. ఆ చిన్నారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కూడా అందడం లేదు. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలోనే ఆ బాలిక అత్త ఒక వీడియో రూపొందించి, సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. దానిని చూసి, ఆ చిన్నారికి ఎవరైనా సాయం చేస్తారేమోనని ఆమె భావిస్తోంది. ఈ వీడియో చూసిన ఒక యూజర్‌.. అంత చిన్నపిల్ల మదిలో అంత వేదన ఉండటం చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది అని రాశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇది కూడా చదవండి: ఇకపై రెంట్‌కు డాడీ.. మమ్మీ చిల్‌ అవ్వొచ్చు!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)