Breaking News

ఇజ్రాయెల్‌లో వరుస పేలుళ్లు

Published on Fri, 02/21/2025 - 07:51

టెల్‌అవీవ్‌:మధ్య ఇజ్రాయెల్‌లో వరుస భారీ పేలుళ్లు సంభవించాయి. బాట్‌యామ్‌ నగరంలోని ఓ పార్కింగ్‌ ప్రదేశంలో ఉన్న మూడు బస్సుల్లో వరుసగా పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లు ఉగ్రవాదుల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ పేలుళ్లలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. మరో రెండు బస్సుల్లో దొరికిన బాంబులను పోలీసులు నిర్వీర్యం చేశారు.

వరుస పేలుళ్లతో దేశవ్యాప్తంగా బస్సులు,రైళ్లలో తనిఖీలు చేపట్టారు. బాంబులు ఎవరు పెట్టారన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల పాలస్తీనాలోని వెస్ట్‌బ్యాంక్‌లో దొరికన పేలుడు పదార్థాలను పోలినట్లు తాజాగా దొరికన బాంబులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. పేలుళ్లకు హమాస్‌ అనుబంధ ఉ‍గ్రవాద సంస్థ ఖస్సమ్‌ బ్రిగేడ్స్‌ కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

వెస్ట్‌బ్యాంక్‌లోని తమ భూభాగాన్ని ఆక్రమించుకున్నవారిపై ప్రతీకారం తీర్చుకుంటామని బబ్రిగేడ్స్‌ తాజాగా సోషల్‌మీడియాలో ఒక పోస్టు పెట్టింది. గాజాలో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్‌ వెస్ట్‌బ్యాంక్‌పై దాడులు మొదలు పెట్టింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందన్న కారణంతో  హమాస్‌పై  ఇజ్రాయెల్‌ ఆగ్రహంతో ఉంది. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)