Breaking News

కమలా హారీస్‌కు పుతిన్‌ మద్దతు.. ట్విస్ట్‌ ఇచ్చిన లావ్రోవ్‌

Published on Sun, 09/22/2024 - 09:17

మాస్కో: అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచ దేశాల ఫోకస్‌ ఉంది. ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనే చర్చ కూడా నడుస్తోంది. ఎన్నికల్లో పలు దేశాలు నేతలు ఎవరికి మద్దతు ఇస్తున్నారనే అంశం కూడా ఎన్నికల్లో కీలక కానుంది. ఇక, కమలా హారీస్‌కే తమ మద్దతు అంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చేసిన కామెంట్స్‌ హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో పుతిన్‌ వ్యాఖ్యలపై రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ క్లారిటీ ఇచ్చారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై లావ్రోవ్‌ తాజాగా స్పందిస్తూ.. ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారీస్‌కు మద్దతు ఉంటుందని పుతిన్‌ సరదాగా మాత్రమే అన్నారు. పుతిన్‌ అప్పుడప్పుడు జోక్స్‌ వేస్తుంటారు. అందులో భాగంగానే ఇలా మాట్లాడారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మా జోక్యం ఏమీ ఉండదు. ఇంతకుముందు, ఇప్పుడు.. ఎన్నికల్లో జోక్యం చేసుకోము. మా వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదు అంటూ కామెంట్స్‌ చేశారు.

 

ఇదిలా ఉండగా.. కొద్దిరోజులు క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. అమెరికా ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కమలాతో పనిచేయడం సులువని తనదైన శైలిలో మాట్లాడారు. అయితే, హారీస్‌ ఎంపికలో జో బైడెన్‌ నిర్ణయాన్ని తాను గౌరవిస్తానన్నారు. ఏదేమైనా.. ఆ దేశ అధ్యక్షుడు ఎవరనే విషయాన్ని అక్కడివారే నిర్ణయిస్తారని ముగించారు.

అనంతరం, పుతిన్‌ వ్యాఖ్యలపై వైట్‌హౌస్‌ వర్గాలు స్పందించాయి. పుతిన్‌ కామెంట్స్‌కు అమెరికా నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ అధికార ప్రతినిధి జాన్‌ కిర్బీ కౌంటరిచ్చారు. అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవరనే విషయాన్ని నిర్ణయించేది కేవలం స్థానికులే. మా అధ్యక్ష ఎన్నికలపై పుతిన్‌ మాట్లాడటం ఆపేస్తే మంచింది. ఈ ఎన్నికల్లో మీ జోక్యాన్ని ఎవరూ కోరుకోవడం లేదు. భవిష్యత్‌లో కూడా ఎన్నికల గురించి మాట్లాడకండి అంటూ వ్యాఖ్యలు చేశారు. 

ఇది కూడా చదవండి: బైడెన్‌తో చర్చలు ఫలించాయి: ప్రధాని మోదీ

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)