Breaking News

అమెరికా షట్‌డౌన్‌ ముగిసినట్టే!

Published on Wed, 11/12/2025 - 05:51

వాషింగ్టన్‌:  అమెరికా చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా 41 రోజులపాటు ప్రజలను అష్టకష్టాలకు గురిచేసిన షట్‌డౌన్‌ ఎట్టకేలకు ముగింపు దశకు చేరింది. షట్‌డౌన్‌ను ముగించి, ప్రభుత్వ సేవలను మళ్లీ ప్రారంభించడానికి వీలుగా సంబంధిత బిల్లును సోమవారం సెనేట్‌లో ఆమోదించారు. బిల్లుకు మద్దతివ్వడాన్ని విపక్ష డెమొక్రటిక్‌ పార్టీలో కొందరు సభ్యులు వ్యతిరేకించారు. అయినప్పటికీ మెజార్టీ సభ్యులు బిల్లుకు ఆమోదం తెలిపారు. అధికార రిపబ్లికన్‌ పార్టీతో అవగాహన కుదరడమే ఇందుకు కారణం. సెనేట్‌లో బిల్లుకు అనుకూలంగా 60 ఓట్లు, వ్యతిరేకంగా 40 ఓట్లు వచ్చాయి. ఇకపై కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభలో ఆమోదం పొందాల్సి  ఉంది. ఈ విషయంలో ట్రంప్‌ ప్రభుత్వం పట్టుదలతో వ్యవహరిస్తుండడంతో అతిత్వరలో షట్‌డౌన్‌ ముగిసిపోనున్నట్లు తెలుస్తోంది.

బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా మద్దతు ప్రకటించారు. ప్రభుత్వ సేవలను చాలా వేగంగా పునరుద్ధరించబోతున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా, షట్‌డౌన్‌ ముగింపు బిల్లును బుధవారం మధ్యాహ్నమే ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిసింది. ఈ సభలో కూడా ఆమోదం పొందితే బుధవారమే షట్‌డౌన్‌కు తెరపడే అవకాశం ఉంది. గత నెలలో వార్షిక నిధుల బిల్లుకు సెనేట్‌ ఆమోదం తెలపకపోవడంతో దేశమంతటా షట్‌డౌన్‌ మొదలైన సంగతి తెలిసిందే.

దీంతో ప్రభుత్వ సేవలు చాలావరకు నిలిచిపోయాయి. అత్యంత ముఖ్యమైన సేవలు మాత్రమే కొనసాగాయి. వేతనాలు హఠాత్తుగా ఆగిపోవడంతో ఉద్యోగుల ఇక్కట్లపాలయ్యారు. నిధులు లేక సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి. పలు కీలక రంగాలు ప్రభావితమయ్యాయి. విమానయాన సేవలు కూడా ఆగిపోయాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)