Breaking News

ఫిలిప్పీన్స్ స్కూల్‌లో కాల్పులు.. ముగ్గురు మృతి

Published on Mon, 06/22/2026 - 11:12

మనీలా: ఫిలిప్పీన్స్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ఒక పాఠశాల లోపల దుండగులు జరిపిన విచక్షణారహిత కాల్పులు కలకలం రేపాయి. నిత్యం విద్యార్థుల సందడితో ఉండే క్లాస్‌రూమ్‌ల మధ్యే బుల్లెట్ల వర్షం కురవడంతో ముగ్గురు  అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘాతుకంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా రక్తసిక్తంగా మారింది.

పాఠశాల ఆవరణలోకి చొరబడి..
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లోని టాక్లోబన్ సిటీ పరిధిలో గల ‘బారంగే సాన్ జోస్’ లోని ఒక పాఠశాలలో సోమవారం ఉదయం దాదాపు 9 గంటల సమయంలో ఈ దారుణ ఘటన జరిగింది. పాఠశాల ఆవరణలోకి చొరబడిన దుండగులు ఒక్కసారిగా తుపాకులతో విరుచుకుపడ్డారు. ఈ కాల్పుల్లో మొత్తం ఎనిమిది మందికి బుల్లెట్లు దూసుకెళ్లాయి. సమాచారం అందిన వెంటనే టాక్లోబన్ సిటీ పోలీస్ స్టేషన్-1 అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు.

ఒకరి అరెస్ట్.. మరొకరి కోసం వేట
ఈ  ఘటన అనంతరం  పోలీసులు ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిని మైనర్‌గా గుర్తించారు. ఈ దాడిలో పాల్గొన్నట్లు అనుమానిస్తున్న రెండో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నిందితులిద్దరూ స్థానిక బారంగే సాన్ జోస్ ప్రాంతానికి చెందినవారేనని ప్రాథమిక సమాచారం.

ఆస్పత్రిలో క్షతగాత్రులు.. దర్యాప్తు ముమ్మరం
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఐదుగురిని చికిత్స నిమిత్తం తక్షణమే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మరణించిన వారి వివరాలను పోలీసులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన తర్వాతే పేర్లను ప్రకటిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఘాతుకానికి గల కారణాలు, వారి  లక్ష్యం ఏమిటనే దానిపై టాక్లోబన్ సిటీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

ఇది కూడా చదవండి: కోడింగ్ టు ప్రిస్క్రిప్షన్: సత్తా చాటిన ‘ఆకృతి @ 32’

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)