Breaking News

సౌదీ రాజధానిలో హై అలర్ట్‌.. వైమానిక దాడులు?

Published on Sat, 09/19/2026 - 19:12

రియాద్‌: యెమెన్‌లో హౌతీలు విజృంభిస్తున్న నేపథ్యంలో సౌదీ అలర్టయ్యింది. ఆ నేపథ్యంలోనే తొలిసారిగా రాజధాని రియాద్‌లో హెచ్చరికలు జారీ చేసింది. శనివారం తెల్లవారుజామున రియాద్‌లో  వైమానిక దాడి హెచ్చరిక జారీ అయింది.  ఆ ప్రాంతంలోని పౌరులకు వైమానిక దాడుల ముప్పు ఉందని ఇళ్లలోనే ఉండాలని అధికారులు సందేశాలు పంపారు. కొద్దిసేపటికే రెండు భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో నగర ప్రజల్లో ఆందోళన వాతావరణం నెలకొంది.

యెమెన్‌లో సౌదీ అరేబియా మద్ధతిస్తున్న ప్రభుత్వ బలగాలకు అక్కడి హౌతీలకు తీవ్రంగా యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో  హౌతీలు వేగంగా దాడులు చేస్తూ భారీగా భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఎర్ర సముద్ర తీర ప్రాంతాల్లో వారి పట్టు పెరగడం సౌదీ అరేబియాకు ఆందోళన కలిగిస్తోంది. గతంలో హౌతీలపై సౌదీ అరేబియా అనేక వైమానిక దాడులు చేసినప్పటికీ వారి పురోగతిని పూర్తిగా అడ్డుకోలేకపోయింది. తాజా పరిణామాల నేపథ్యంలో సౌదీ ప్రభుత్వం మరోసారి అప్రమత్తమైంది. హౌతీలు తమపై దాడి చేసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేసింది.  

మక్కాపై దాడి ఆరోపణ
ఇటీవల మక్కాపై హౌతీలు దాడి చేశారని సౌదీ అరేబియా ఆరోపించగా, హౌతీలు ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. రియాద్‌లో జారీ చేసిన తాజా హెచ్చరికకు ముప్పు ఎక్కడి నుంచి వచ్చిందో సౌదీ అధికారులు అధికారికంగా వెల్లడించలేదు.  అయితే  యెమెన్‌లో కొనసాగుతున్న పోరాటం కారణంగా ఇప్పటివరకు 1.12 లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. 

యెమెన్‌లోని ఎర్ర సముద్ర తీర ప్రాంతాలపై హౌతీల నియంత్రణ పెరగడం వల్ల అంతర్జాతీయ సముద్ర వాణిజ్యంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.  ఇదే సమయంలో సౌదీ అరేబియా తన రక్షణ సామర్థ్యాలను పెంచుకునే చర్యల్లో భాగంగా అమెరికా నుంచి 48 ఎఫ్-35 యుద్ధ విమానాల కొనుగోలుకు 24.3 బిలియన్ డాలర్ల ఒప్పందానికి అనుమతి పొందింది. అమెరికా సహాయం కోరినప్పటికీ, హౌతీలపై నేరుగా దాడులు చేయడానికి అమెరికా నిరాకరించినట్లు సమచారం వచ్చింది.

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)