Breaking News

సౌదీ సంచలన నిర్ణయం.. వారికి ఇక రోజూ పండగే..

Published on Tue, 12/09/2025 - 09:34

రియాద్: సౌదీ అరేబియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని ముస్లిమేతర నివాసితులకు మద్యం విక్రయించాలని నిర్ణయించింది. అయితే ఇందుకు పలు కఠిన నిబంధనలు విధించింది. దేశీయంగా తీసుకున్న ఆర్థిక పరివర్తన లక్ష్యాలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నది.  విదేశీ మూలధనాన్ని ఆకర్షించేందుకు సౌదీ ప్రయత్నిస్తోంది.  

దేశంలోని రియాద్‌లో ఏర్పాటు చేసిన ఏకైక మద్యం దుకాణంలోకి ప్రవేశించేందుకు ముస్లిమేతర నివాసితులు తమ ధృవీకరణ పత్రాన్ని చూపించాల్ని ఉంటుంది. అంతకుముందు విదేశీ దౌత్యవేత్తల కోసం ప్రారంభించిన ఈ దుకాణం ఇటీవల ప్రీమియం రెసిడెన్సీ హోదా కలిగిన ముస్లిమేతరులకు కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ దుకాణంలో కొనుగోళ్లు కేవలం నెలవారీ పాయింట్-బేస్డ్ అలవెన్స్ సిస్టమ్ కింద మాత్రమే చేయవచ్చని సమాచారం. కాగా సౌదీ అరేబియా రాజధాని రియాద్‌తో పాటు ఇతర నగరాల్లో కూడా కొత్త మద్యం దుకాణాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నిబంధనలు మద్యం యాక్సెస్‌ను సులభతరం చేసే దిశగా తీసుకుంటున్న చర్యలలో భాగమని విశ్లేషకులు అంటున్నారు. అయితే ప్రభుత్వం నుండి ఈ మార్పులపై ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు.

రియాద్‌ను వ్యాపార, పెట్టుబడులకు  పోటీ కేంద్రంగా మార్చడానికి సౌదీ అరేబియా విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. విదేశీ మూలధనాన్ని ఆకర్షించడం అనేది విజన్ 2030 లో భాగంగా ఉంది.  ఆర్థిక పరివర్తన లక్ష్యాలకు దీనిని కీలకంగా సౌదీ అరేబియా భావిస్తోంది.  మరోవైపు సౌదీ అరేబియా ప్రభుత్వం ఇటీవల మహిళల డ్రైవింగ్‌పై నిషేధాన్ని రద్దు చేసింది. అలాగే ప్రజా వినోదం, సంగీతం తదితర రంగాలలో మహిళల ప్రవేశానికి అనుమతులు మంజూరు చేసింది.  దేశంలోని పర్యాటక రంగాన్ని కూడా మరింతగా ప్రోత్సహిస్తోంది. 

ఇది కూడా చదవండి: లడఖ్‌లో చైనా గూఢచారి?.. ఫోరెన్సిక్ పరీక్షకు ఫోన్

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు