Breaking News

ఇరాన్‌ అణు కేంద్రాలకు భారీ నష్టం.. శాటిలైట్‌ చిత్రాలలో..

Published on Sun, 06/15/2025 - 07:35

టెహ్రాన్: ఇజ్రాయెల్ వరుస దాడులతో ఇరాన్ అణు కేంద్రాలకు  భారీ నష్టం వాటిల్లింది. దీనిని ఉపగ్రహ ఛాయా చిత్రాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ ఉపగ్రహ చిత్రాలను మాక్సర్ విడుదల చేసింది. ఇరాన్ ప్రపంచ హెచ్చరికలను ధిక్కరించి, అణ్వాయుధ కార్యక్రమాన్ని కొనసాగిస్తోందని ఇజ్రాయెల్ చాలా కాలంగా ఆరోపిస్తోంది.

ఇరాన్‌లో భారీస్థాయిలో అణు బాంబులను ఉత్పత్తి చేయగల యురేనియం నిల్వలు ఉన్నాయని ఇజ్రాయెల్‌ పేర్కొంది. అయితే ఇరాన్ మాత్రం తన అణు కార్యక్రమం పౌర ప్రయోజనాల కోసమేనని చెబుతోంది. తాజాగా విడుదలైన హై-రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాలు ఇరాన్‌లోని ముఖ్య అణు కేంద్రానికి వాటిల్లిన నష్టాన్ని చూపిస్తున్నాయి. అలాగే దీనికి ముందున్న స్థితిని కూడా సరిపోల్చాయి. యూఎన్‌ అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) తెలిపిన వివరాల ప్రకారం ఇజ్రాయెల్ ఆపరేషన్‌లో నటాంజ్, ఫోర్డోలోని ఇరాన్ భూగర్భ యురేనియం కేంద్రాలు, ఇస్ఫహాన్‌లోని యురేనియం తరలింపు కేంద్రంపై దాడులు జరిగాయి.

ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించిన యూఎస్‌ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ (ఐఎస్‌ఐఎస్‌)నివేదిక ప్రకారం అణు కేంద్రంలో విద్యుత్ సరఫరాకు విస్తృతమైన నష్టం వాటిల్లింది. టెహ్రాన్‌కు ఆగ్నేయంగా 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న నటాంజ్‌లోని అణు కేంద్రంలో సమృద్ధిగా యురేనియం నిల్వలు ఉన్నాయి. అలాగే ఫోర్డోలోని అణు కేంద్రం టెహ్రాన్‌కు నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో ఉంది.  దీనికి స్వల్పంగా నష్టం వాటిల్లిందని ఇరాన్ పేర్కొంది.

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ తమ పోరాటం 46  ఏళ్లుగా సాగుతున్న నియంతృత్వంపై జరుగుతున్న దాడి అని అన్నారు. ఇరాన్‌ విముక్తి దినం దగ్గర పడిందని, అది జరిగినప్పుడు, ఇరు దేశాల ప్రజల మధ్య స్నేహం మరోసారి వర్ధిల్లుతుందన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఇరాన్‌ పాలనను ఇజ్రాయెల్ అనుమతించబోదన్నారు. ఇరాన్‌ తనదగ్గరున్న ఆయుధాలను, అణ్వాయుధాలను ఉగ్రవాదులను అందించాలని యోచిస్తోందని నెతన్యాహు  ఆరోపించారు. అదేగనుక జరిగితే అణు ఉగ్రవాదానికి తెరలేస్తుందని, అప్పుడు అది యూరప్ నగరాలకు, చివరికి అమెరికాకు ముప్పు తెచ్చిపెడుతుందని ఆయన హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: Air India crash: విమానంలో ‘11ఏ’ సురక్షితమా? రమేష్‌ని అదే కాపాడిందా?

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)