Breaking News

భారతీయుడిని చంపిన పాకిస్తాన్‌ డాన్‌ హత్య

Published on Sun, 04/14/2024 - 18:22

ఇస్లామాబాద్‌ : భారత్‌కు చెందిన సరబ్‌జిత్ సింగ్‌ను జైలులో చంపిన పాకిస్తాన్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్‌ అమీర్ సర్ఫరాజ్ హత్యకు గురయ్యాడు. ఆదివారం లాహోర్‌లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అమీర్‌ సర్ఫరాజ్‌ను కాల్చి చంపినట్లు తెలుస్తోంది.   

సరబ్‌జీత్‌ సింగ్‌ ఎవరు?
సరబ్‌జీత్‌ సింగ్‌ భారత్‌, పాకిస్థాన్‌ సరిహద్దులోని భిఖివిండ్‌ గ్రామానికి చెందిన రైతు. 1991లో పొరపాటుగా సరిహద్దును దాటి పాక్‌లోకి ప్రవేశించారు. దీంతో గూఢచర్యం ఆరోపణలతో అరెస్ట్‌ చేసిన పాకిస్థాన్‌.. ఆయనకు మరణశిక్ష విధించింది.

సరబ్‌జీత్‌ సింగ్‌పై దాడి చేసిన పాక్‌ డాన్‌
అనంతరం లాహోర్‌లోని కోట్‌ లఖ్‌పత్‌ జైలులో సరబ్‌జీత్‌ శిక్ష అనుభవిస్తున్నారు.  అయితే,  2013లో భారత్‌లో పార్లమెంట్ దాడికి పాల్పడిన అప్జల్ గురుని ఉరితీసిన కొన్ని రోజుల తర్వాత లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో ఉన్న పాకిస్తాన్‌ మోస్ట్‌ వాంటెడ్‌ డాన్‌ అమీర్ సర్ఫరాజ్ సహా ఇతర ఖైదీలు సరబ్‌జీత్‌పై దారుణంగా దాడి చేశారు. ఖైదీలు ఇటుకలతో సరబ్‌జీత్‌పై దాడి చేయడంతో అతని మెదడులో తీవ్రగాయాలై, చికిత్స పొందుతూ జిన్నా ఆస్పత్రిలో మరణించారు.  కాగా, సరబ్‌జీత్‌ 23 ఏళ్లు లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలు శిక్షను అనుభవించారు.  

దల్బీర్‌ కౌర్‌ 22 ఏళ్ల పాటు న్యాయ పోరాటం 
సరబ్‌జీత్‌ సింగ్‌ నిర్దోషిగా ప్రకటించాలంటూ ఆతని సోదరి దల్బీర్‌కౌర్‌ సుదీర్ఘ కాలం పోరాటం చేశారు. తన సోదరుడు పొరపాటున సరిహద్దు దాటారని.. ఆయనను విడుదల చేయాలంటూ దల్బీర్‌ 22 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేశారు. సరబ్‌జీత్‌ను చూసేందుకు పాకిస్థాన్‌ సైతం వెళ్లివచ్చారు. దల్బీర్‌కౌర్‌ గత ఏడాది ఛాతీ నొప్పితో పంజాబ్‌ అమృత్‌సర్‌కు చెందన ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 

‘సరబ్‌జీత్‌’ పేరుతో బయోపిక్‌
సరబ్‌జీత్‌ సింగ్‌, దల్బీర్‌కౌర్‌ జీవితాల ఆధారంగా బాలీవుడ్‌లో ‘సరబ్‌జీత్‌’ బయోపిక్‌ను నిర్మించారు. ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌ దల్బీర్‌ పాత్రలో నటించారు.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)