Breaking News

జపాన్‌ కొత్త ప్రధాని తకైచి 

Published on Sun, 10/05/2025 - 06:18

టోక్యో: జపాన్‌ చరిత్రలో తొలిసారి ఒక మహిళ ప్రధానమంత్రి పదవి చేపట్టబోతున్నారు. అధికార లిబరల్‌ డెమోక్రాటిక్‌ పార్టీ (ఎల్‌డీపీ) అధ్యక్షురాలిగా ఆర్థిక భద్రత శాఖ మాజీ మంత్రి సనే తకైచి (64) ఎన్నికయ్యారు. జపాన్‌లో అధికార పార్టీ అధ్యక్షుడే ప్రధాని అవుతారు. శనివారం అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో వ్యవసాయ శాఖ మంత్రి షింజిరో కొయిజుమిపై ఆమె గెలుపొందారు. షింజిరో కొయిజుమి ఆ దేశ మాజీ ప్రధాని జునిచిరో కొయిజుమి కుమారుడు. 

పార్టీలో తిరుగుబాటు నేపథ్యంలో ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని ప్రస్తుత ప్రధాని షిగెరు ఇషిబా నిర్ణయించుకోవటంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. గత ఏడాది జరిగిన పార్లమెంటు ఎగువ, దిగువ సభల ఎన్నికల్లో ఎల్‌డీపీ ఓటమి చవిచూడటంతో షిగెరు నాయకత్వంపై పార్టీ నేతలు విశ్వాసం కోల్పోయారు. అయితే ప్రధానిని ఎన్నుకునే దిగువ సభలో ఇప్పటికీ ఎల్‌డీపీనే అతిపెద్ద పార్టీగా ఉండటంతో తకైచి ప్రధాని కావటం ఖాయమని చెబుతున్నారు. మరో పది రోజుల్లో జపాన్‌ పార్లమెంటు కొత్త ప్రధానిని ఎన్నుకొనే అవకాశం ఉంది.  

చైనాకు ప్రబల శత్రువు 
సనే తకైచికి జపాన్‌ రాజకీయాల్లో అత్యంత సంప్రదాయవాదిగా పేరుంది. ఆమె మాజీ ప్రధాని షింజో అబె విధానాలకు అతిపెద్ద మద్దతుదారు. చైనాను ప్రబల శత్రువుగా భావిస్తారు. జపాన్‌ సైనికీకరణకు గుర్తుగా భావించే యషుకుని ఆలయాన్ని ఆమె తరుచూ సందర్శిస్తుంటారు. పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత ఆమె మాట్లాడుతూ.. ప్రధాని పదవి చేపట్టిన తర్వాత తాను మొదట చేయబోయే పని దేశంలో పెరిగిపోతున్న వస్తువుల ధరలను తగ్గించటమేనని తెలిపారు. అమెరికాతో దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రయతి్నస్తానని చెప్పారు. 

దేశానికి కొత్తగా ఎదురవుతున్న భద్రత, దౌత్య సవాళ్లపై దృష్టిపెడుతానని వెల్లడించారు. అయితే, ఆమె పదవి చేపట్టిన వెంటనే అతిపెద్ద దౌత్య సవాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దక్షిణకొరియాలో ఈ నెల 31 నుంచి ఆసియా పసిఫిక్‌ ఆర్థిక సహకార సమాఖ్య శిఖరాగ్ర సదస్సు ప్రారంభం కానుంది. ఆ సమావేశాల్లో అమెరికా అధ్యక్షుడితో ఆమె జపాన్‌ ప్రధాని హోదాలో ముఖాముఖి సమావేశం కావాల్సి ఉంటుంది. 

ఇటీవల మిత్ర దేశాలపై కూడా ఎడాపెడా టారిఫ్‌లు విధిస్తున్న ట్రంప్‌.. జపాన్‌ను కూడా వదల్లేదు. మరోవైపు జపాన్‌ తన సైనిక వ్యయాన్ని పెంచాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాతో దౌత్య సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇస్తానని తకైచి తెలిపారు. మరోవైపు దేశంలో సుదీర్ఘకాలంగా అధికారంలో ఉన్న ఎల్‌డీపీకి ఎదురుగాలి వీస్తోంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పార్లమెంటులోని రెండు సభల్లోనూ ఆ పార్టీ మెజారిటీ కోల్పోయింది. ఇప్పుడు మళ్లీ తన పారీ్టపై ప్రజలకు విశ్వాసం కల్పించటం తకైచి ముందున్న అతిపెద్ద సవాలు.  

పట్టువదలని సంకల్పం
సనే తకైచి ఎల్‌డీపీ అధ్యక్ష పదవికి 2021లోనే పోటీ పడ్డారు. అయితే, నాడు ఆమె విపరీత సంప్రదాయ భావాలను వ్యతిరేకించిన పారీ్టలోని మెజారిటీ సభ్యులు ఆమెను ఓడించారు. దీంతో నాడు ఆమె మూడో స్థానంలో నిలిచారు. తకైచి 1961 మార్చి 7న నారా ప్రావిన్స్‌లోని యమటోకొయిరామాలో జని్మంచారు. ఆమె కోబె యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ చదివారు. అనంతరం బ్రాడ్‌కాస్టర్‌గా, రాజకీయ సలహాదారుగా పనిచేశారు. పలు రచనలు కూడా చేశారు. అనంతరం ఎల్‌డీపీలో చేరి 1993లో తొలిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 

మాజీ ప్రధాని షింజో అబెకు ఆమె ప్రధాన అనుచరురాలిగా గుర్తింపు పొందారు. ఆయన మంత్రివర్గంలో పనిచేశారు. 2019–20 మధ్య దేశ అంతర్గత వ్యవహారాలు, సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. ఫుమియో కిషిడా మంత్రివర్గంలో 2022–24 మధ్య ఆర్థిక భద్రత సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2024లో కూడా ఆమె పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు. కానీ, ప్రస్తుత ప్రధాని షిగేరు ఇషిబా చేతిలో అతి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. ముచ్చటగా మూడోసారి పట్టువదలక ప్రయత్నించి విజయం సాధించి ప్రధాని పదవి చేపట్టబోతున్నారు. ఆమె జపాన్‌ తొలి మహిళా ప్రధానిగానే కాకుండా నారా ప్రావిన్స్‌ నుంచి తొలి ప్రధానిగా కూడా రికార్డు సృష్టించబోతున్నారు.      

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)