Breaking News

హఠాత్తుగా ఆగిన కేబుల్ కార్.. తుళ్లిపడిన ప్రయాణికులు!

Published on Tue, 12/16/2025 - 08:11

శాన్ ఫ్రాన్సిస్కో: అమెరికాలోని కాలిఫోర్నియాలోగల శాన్ ఫ్రాన్సిస్కోలో కేబుల్‌ కార్‌ ప్రమాదం చోటుచేసుకుంది. నోబ్ హిల్‌లో కాలిఫోర్నియా స్ట్రీట్ కేబుల్ కార్ లైన్‌లో జరిగిన ఈ ఘటనలో 13 మంది ప్రయాణికులు గాయపడ్డారు. లీవెన్‌వర్త్- హైడ్ వీధుల మధ్య 1351 కాలిఫోర్నియా వీధి వద్ద కేబుల్ కారు అకస్మాత్తుగా ఆగిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శాన్ ఫ్రాన్సిస్కో అగ్నిమాపక విభాగం (SFFD) వెంటనే స్పందించి, సంఘటనా స్థలంలో 15 మంది బాధితులను రక్షించింది. వీరిలో 13 మంది గాయపడగా, వారిని  స్థానిక ఆస్పత్రులకు తరలించారు.
 

ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. ఘటనా స్థలంలో కారు విండ్‌షీల్డ్ పగిలి ఉండటాన్ని  అధికారులు గమనించారు. అగ్నిమాపక అధికారులు అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం కేబుల్ కారుపై ఎవరో ఏదో బలమైన వస్తువు విసిరేసి ఉండవచ్చని, ఫలితంగా డ్రైవర్ అత్యవసరంగా కారును ఆపివేయవలసి వచ్చివుంటుందన్నారు. దీంతో ప్రయాణికులు ముందుకు కుదుపునకు గురయ్యారన్నారు.

శాన్ ఫ్రాన్సిస్కో పోలీసు విభాగం ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టింది. ఇందుకోసం హైడ్, లీవెన్‌వర్త్ మధ్య కాలిఫోర్నియా వీధిని మూసివేశారు. కాలిఫోర్నియా స్ట్రీట్ కేబుల్ కార్ లైన్ ప్రమాద ఘటన కారణంగా తాత్కాలికంగా ఈ సేవలకు అంతరాయం కలిగించింది.  దర్యాప్తులో యాంత్రిక తనిఖీ, సాక్షుల వాంగ్మూలాలు కీలకం కానున్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Mexico: కూలిన ప్రైవేట్ జెట్.. పదిమంది సజీవ దహనం

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)