Breaking News

పుతిన్‌తో  జైశంకర్‌ భేటీ 

Published on Fri, 08/22/2025 - 06:03

మాస్కో: భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ గురువారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమయ్యారు. రాజధాని మాస్కోలో జరిగిన ఈ సమావేశంలో భారత్‌–రష్యా సంబంధాలపై వారు చర్చించుకున్నట్లు సమాచారం. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు ప్రతీకారంగా భారత ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 50 శాతం టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో పుతిన్‌తో జైశంకర్‌ సమావేశమై చర్చించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

 పుతిన్‌తో భేటీ అనంతరం జైశంకర్‌ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఉక్రెయిన్‌ విషయంలో తాజా పరిణామాలను తనతో పంచుకున్నందుకు పుతిన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలిపానని చెప్పారు. రష్యా ఫస్ట్‌ డిప్యూటీ ప్రైమ్‌ మినిస్టర్‌ డెనిస్‌ మంతురోవ్, విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌తో తన భేటీ వివరాలను పుతిన్‌కు వివరించానని స్పష్టంచేశారు.   
 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)