Breaking News

ట్రంప్‌పై హత్యాయత్నం: నిందితుడి లేఖలో ఏముందంటే..

Published on Tue, 09/24/2024 - 09:09

న్యూయార్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇటీవల జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెల్లడి అయ్యాయి. ట్రంప్‌ను హత్యచేస్తానని కొన్ని నెలల ముందే నిందితుడు ర్యాన్‌ రౌత్‌.. లేఖ రాసినట్లు అమెరికా ప్రాసిక్యూటర్లు తెలిపారు. ట్రంప్‌ను హత్య చేయాడానికి గల ఉద్దేశాలను ఆ లేఖలో నిందితుడు రాశాడు. ఇక..దాడికి ముందు మందుగుండు సామగ్రి, ఒక మెటల్ పైపు, ఇతర నిర్మాణ సామగ్రి, నాలుగు ఫోన్లతో ఉన్న బాక్స్‌ను గుర్తు తెలియని వ్యక్తి ఇంటిముందు నిందితుడు పడేశాడని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.

ట్రంప్‌పై హత్యాయత్నం ఘటన వెలుగులోకి వచ్చాక..  ఆ గుర్తు తెలియని వ్యక్తి బాక్స్‌ను తెరవగా అందులో ఈ లేఖ బయటపడినట్లు తెలిపారు. ఆ లేఖలో.. ‘‘ఇది డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాప్రయత్నం. కానీ విఫలం చేశాను. నేను నా వంతు ప్రయత్నం చేశాను. నేను సేకరించిన అన్ని ఇందులో ఉన్నాయి. ఇక.. ట్రంప్‌ను అంతం చేయటం మీ ఇష్టం. ట్రంప్‌ హత్య పూర్తి చేసినవారికి 150,000 డాలర్లు అందిస్తా’’ అని రాసినట్లు తెలిపారు. ఇక.. ఇరాన్‌తో చిన్నపిల్లల మాదిరిగానే ట్రంప్‌ సంబంధాలను ముగించారని ఆ లేఖలో పేర్కొనటం గమనార్హం.

సెప్టెంబర్ 15న ట్రంప్  వెస్ట్ పామ్ బీచ్ కోర్స్‌లో గోల్ఫ్ ఆడుతున్నప్పుడు సమయంలో  నిందితుడు ర్యాన్‌ రౌత్‌ అక్కడే సంచరిస్తూ.. హత్యాయత్నానికి ప్రయత్నించగా.. సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై ట్రంప్‌ను కాపాడిన విషయం తెలిసిందే. 58 ఏళ్ల నిందితుడిపై రెండు కేసులు నమోదు అయ్యాయి. ఈ  కేసుల్లో నిందితుడు విచారణ ఎదుర్కొనున్నాడు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)