Breaking News

యూకే అణు జలాంతర్గాములపై రష్యా నిఘా! 

Published on Mon, 04/07/2025 - 06:14

లండన్‌:  యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే) అణు జలాంతర్గాములపై రష్యా ప్రత్యేకంగా నిఘా పెట్టిందా? సముద్రంలో వాటి కదలికలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి రహస్యంగా సెన్సార్లు ఏర్పాటు చేసిందా? అవుననే అంటున్నాయి అంతర్జాతీయ మీడియా కథనాలు. యూకే చుట్టుపక్కల ఉన్న సముద్ర జలాల్లో కొన్ని సెన్సార్‌ పరికరాలను బ్రిటిష్‌ రాయల్‌ నేవీ గుర్తించినట్లు సమాచారం. రష్యా తమ అణు జలాంతర్గాములపై నిఘా పెట్టినట్లు యూకే ఆరోపిస్తోంది. 

తమకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నట్లు రష్యాపై ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. తమ ఆయుధ సంపత్తిని దెబ్బతీయాలన్నదే రష్యా ప్రయత్నంగా కనిపిస్తున్నట్లు అనుమానం వ్యక్తంచేస్తోంది. ఈ పరిణామాన్ని దేశ భద్రతకు ముప్పుగా సైనికాధికారులు అభివరి్ణంచారు. అట్లాంటిక్‌ మహా సముద్రంలో యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయని, రష్యా కార్యకలాపాలు అసాధారణ రీతిలో పెరిగిపోయాయని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

 రష్యా అధినేత పుతిన్‌ చేపట్టిన గ్రేజోన్‌ యుద్ధ వ్యూహంలోనే భాగంగానే తమ అణు జలాంతర్గాములను రష్యా టార్గెట్‌ చేసుకున్నట్లుగా యూకే అధికారులు అనుమానిస్తున్నారు. సముద్ర గర్భంలోని రహస్య కేబుల్స్‌తోపాటు పైప్‌లైన్లు, కీలక పరికరాలను ధ్వంసం చేయడం ద్వారా పరోక్ష యుద్ధం సాగించడమే గ్రేజోన్‌ వ్యూహం. ఇది ఇటీవలి కాలంలో మరింత ఉధృతమైందని చెబుతున్నారు. 

గత 15 నెలల వ్యవధిలో బాల్టిక్‌ సముద్రంలో 11 డీప్‌–సీ కమ్యూనికేషన్‌ కేబుల్స్‌ ధ్వంసమయ్యాయి. సముద్ర గర్భంలోని తమ మౌలిక సదుపాయాలను రక్షించుకోవడానికి కృషి చేస్తున్నామని యూకే అధికారులు అంటున్నారు. ప్రచ్ఛన్న యుద్ధం ముగినప్పటి నుంచి బ్రిటన్‌–రష్యా మధ్య పిల్లి, ఎలుక తరహాలో పోరాటం జరుగుతూనే ఉంది. అది ఇటీవలి కాలంలో మరింత ఉధృతమైందని యూకే నిపుణులు అంటున్నారు.   
 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)