Breaking News

రష్యా క్షిపణి దాడుల్లో 34 మంది మృతి

Published on Mon, 04/14/2025 - 06:02

కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భీకర క్షిపణి దాడులకు పాల్పడింది. సుమీ నగరం నడిబొడ్డున ఆదివారం జరిపిన వరుస దాడుల్లో కనీసం 34 మంది మృత్యువాత పడగా 117 మంది క్షతగాత్రులయ్యారు. ఉదయం 10.15 గంటల సమయంలో జనావాసాలున్న ప్రాంతంలో పామ్‌ సండే వేడుకల్లో పాల్గొన్న వారిపై పడ్డాయి. వీటి పేలుడు తీవ్రతకు ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగకమ్ముకుని భీతావహంగా మారింది. ఇద్దరు చిన్నారులు సహా 34 మంది ప్రాణాలు కోల్పోయారు. 

మరో 15 మంది చిన్నారులు సహా 117 మంది గాయపడ్డారు. భవనాలు శిథిలాల దిబ్బగా మారింది. నుజ్జయిన వాహనాల నుంచి మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. ఈ దాడులపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ మండిపడ్డారు. రష్యాను ఉగ్రవాదిగా పరిగణిస్తూ చర్యలు తీసుకోవాలని పశ్చిమ దేశాలకు విజ్ఞప్తి చేశారు. కాల్పుల విరమణకు తూట్లు పొడుస్తున్నారంటూ రష్యా, ఉక్రెయిన్‌ పరస్పరం ఆరోపణలు చేసుకున్న మరునాడే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)