Breaking News

ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల దాడి.. ఏడుగురి మృతి

Published on Sat, 08/31/2024 - 08:31

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. రష్యా సైన్యం శుక్రవారం ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్‌ నగరంలోని అపార్టుమెంట్లు, ఆటస్థలాల్లో వైమానికి దాడులతో విరుచుకుపడింది. రష్యా బాంబుల దాడిలో ఎడుగురు మృతి చెందగా.. సుమారు 77 మందికి గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు. 

బాంబు దాడిలో 12 అంతస్థుల అపార్టుమెంట్‌లో భారీగా మంటలు చెలరేగాయని ఖర్కీవ్‌ నగర మేయర్‌ వెల్లడించారు. అపార్టమెంట్‌ శిథిలాల నుంచి  ఓ మహిళ మృతదేహాన్ని బయటకు తీశామని.. మృత సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో సుమారు 20 మంది పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సర్వీసెస్‌ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.

ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా సైన్యం ఖర్కీవ్‌ నగరమే లక్ష్యంగా  దాడులు చేస్తోంది. ఇప్పటికే పలుసార్లు ధ్వంసం అయింది. అయితే ఇటీవల కాలంలో ఖర్కీవ్‌పై రష్యా  దాడులు తగ్గినప్పటికీ.. రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలోకి ఉక్రేయిన్‌ సైన్యం చొచ్చుకుపోవటంతో ప్రతీకారంగా బాంబులు వేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

#

Tags : 1

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)