Breaking News

ఉక్రెయిన్‌పై రష్యా మిసైల్స్‌ దాడి.. 20 మందికిపైగా మృతి

Published on Mon, 07/08/2024 - 18:14

కీవ్‌: రష్యా సైన్యం ఉక్రెయిన్‌లోని పలు సిటీలు టార్గెట్‌గా భీకర దాడులకు తెగపడింది. సోమవారం ఉక్రెయిన్‌ నగరాలపై పదుల సంఖ్యలో మిసైల్స్‌తో విరుచుకుపడింది.  ఉకక్రెయిన్ రాజధాని కీవ్‌లో  ఓ చిన్న పిల్లల హాస్పిటల్‌పై మిసైల్స్‌తో దాడి చేసింది. ఈ దాడిలో   ఏడుగురు మృతి చెందారు. ఇక్కడితో ఆగకుండా క్రైవీ రిహ్ సిటీలోని సెంట్రల్‌ యూనివర్సిటీపై మరోదాడి చేశారు.  ఈ  మిసైల్స్‌ దాడిలో 10 మంది మృతి చెందారు. 

‘‘ఉక్రెయిన్‌లోని ఐదు సిటీలను రష్యా సైనికులు టార్గెట్‌ చేశారు. పలు భవనాలు, అపార్టుమెంట్లపై 40కి పైగా మిసైల్స్‌ ప్రయోగించారు. ప్రపంచం ప్రస్తుతం మౌనంగా ఉండకూడదు. ఎందుకంటే రష్యా ఏంటో, ఆ దేశం ఎలాంటి దాడులో చేస్తోందో ప్రపంచం మొత్తం గమనించాలి’’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ సోషల్‌మీడియాలో పేర్కొన్నారు.

‘రష్యా  సైన్యం సోమవారం చేసిన దాడుల్లో సుమారు 20కిపైగా  మంది మృతి చెందారు. మిసైల్‌ దాడుల్లో సుమారు 50 మంది గాయపడ్డారు’అని ఉక్రెయిన్‌ మంత్రి ఇహోర్ క్లైమెన్కో తెలిపారు.

క్రైవీ రిహ్  నగరంలో జరిగిన దాడుల్లో 10 మంది మృతి చెందగా 31 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక్కడ ఒక్కసారిగా పెద్దఎత్తున మిసైల్స్‌ దాడి జరిగిందని అధికారుల వెల్లడించారు.  అమెరికాలోని వాషింగ్టన్‌ నగరంలో మూడు రోజుల నాటో సమావేశాల నేపథ్యంలో రష్యా ఉక్రెయిన్‌పై మిసైల్స్‌తో మెరుపుదాడులకు  దిగటం  గమనార్హం.

Videos

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)