Breaking News

పింఛనుదారుల క్యూలైన్‌పై రష్యా దాడి

Published on Wed, 09/10/2025 - 03:08

కీవ్‌: పింఛనుదారుల క్యూలైన్‌పై రష్యా జరిపిన దాడిలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్‌లోని డొనెట్‌స్క్‌ ప్రాంతంలో ఘటన చోటుచేసుకుంది. స్లొవెయాన్‌స్క్‌ నగరానికి సమీపంలోని యరోవా గ్రామంలో మంగళవారం ఉదయం పింఛను తీసుకునేందుకు క్యూలైన్‌లో నిల్చున్న వృద్ధులపై రష్యా యుద్ధ విమానం గ్లైడ్‌ బాంబును జారవిడిచింది. ఘటనలో 24 మంది వృద్ధులు ప్రాణాలు కోల్పోగా, మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

బాధితులంతా రిటైర్డు ఉద్యోగులని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. ఈ దారుణాన్ని వరి్ణంచడానికి మాటలు చాలవన్నారు. ఇది రష్యా పాల్పడిన క్రూరమైన చర్యగా అభివర్ణించారు. ప్రపంచ దేశాలు మౌనంగా ఉండరాదనీ, తమపై దురాక్రమణకు పాల్పడినందుకు ప్రతిగా రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించి, ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలని పిలుపునిచ్చారు. ఘటనపై రష్యా రక్షణ శాఖ స్పందించలేదు. ఘటనాప్రాంతం దృశ్యాలు, దాడిలో తీవ్రంగా దెబ్బతిన్న పోస్టల్‌ శాఖ వ్యాను ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. పోస్టల్‌ శాఖ ఉద్యోగి సైతం గాయపడ్డారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)