Breaking News

మొత్తం ఖైదీల పరస్పర బదిలీకి సిద్ధం

Published on Tue, 02/25/2025 - 06:35

కీవ్‌: రష్యాతో యుద్ధాన్ని ముగించేందుకు, ఇరుదేశాల్లో ఉన్న మొత్తం ఖైదీల మార్పి డికి తాను సిద్ధంగా ఉన్నట్టు ఉక్రెయి న్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సోమవారం ప్రకటించారు. ఉక్రెయిన్‌పైకి రష్యా దండయాత్ర మొదలెట్టి సోమవారంతో మూడేళ్లు పూర్తయిన సందర్భంగా రాజధాని కీవ్‌ నగరంలో జరిగిన సమావేశంలో జెలెన్‌స్కీ మాట్లాడారు. 

యుద్ధాన్ని ముగించే ప్రయ త్నంలో భాగంగా యుద్ధ ఖైదీల మార్పిడిని ఆయన ప్రతిపాదించారు. ‘ రష్యా జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఉక్రేనియన్లను విడుదల చేయాలి. మా జైళ్లలోని రష్యన్లను మేం విడుదలచేస్తాం. యుద్ధ ఖైదీలందరినీ మార్పిడి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. యుద్ధాన్ని ఇలా న్యాయబద్ధమైన మార్గంలో ముగిద్దాం’’ అని జెలెన్‌స్కీ అన్నారు. తమ దేశానికి నాటో సభ్యత్వం ఇస్తే ఉక్రెయిన్‌ అధ్యక్ష పదవి నుంచి వెంటనే వైదొలగడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. 

ఉక్రెయిన్‌ మూడేళ్ళ ప్రతిఘటనను, సైనికుల పోరాటపటిమ, వీరత్వాన్ని జెలెన్‌స్కీ ప్రశంసించారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ మధ్యవర్తిత్వంలో 2024 అక్టోబర్‌లో రష్యా, ఉక్రెయిన్‌ చెరో 95 మంది యుద్ధ ఖైదీలను మార్పిడి చేసుకున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఖైదీల పరస్పర బదిలీ ప్రక్రియ ఇప్పటికి 58సార్లు జరిగింది. గత సెప్టెంబర్‌లో ఇరు దేశాలు 103 మంది ఖైదీలను విడుదల చేశాయి. భద్రతా సాయానికి బదులుగా కీలకమైన సహజ వనరులను సమకూర్చడంపై అమెరికా అధ్యక్షుడితో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.  

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)