Breaking News

Russia-Ukraine war: రష్యా నిర్బంధంలో ఉన్న ఉక్రెయిన్‌ జర్నలిస్టు మృతి

Published on Sat, 10/12/2024 - 05:33

కీవ్‌: రష్యాలో నిర్బంధంలో ఉన్న ఉక్రెయిన్‌ జర్నలిస్ట్‌ 27 ఏళ్ల విక్టోరియా రోషినా మృతి చెందారు. సెప్టెంబర్‌ 19న రోషినా మరణించినట్లు రష్యా గురువారం ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌లో జీవితం గురించి ప్రత్యక్ష కథనాలు రాసిన విక్టోరియా.. గత ఏడాది ఆగస్టులో ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతాలకు రిపోర్టింగ్‌కు వెళ్లారు. ఆ తరువాత  ఆమె కనిపించకుండా పోయింది. 

ఆమె కుటుంబం, ఉక్రెయిన్‌ అధికారులు, జర్నలిస్టుల హక్కుల సంస్థ ఆర్‌ఎస్‌ఎఫ్‌ పదేపదే అభ్యర్థించినా రష్యా అధికారులు ఆమె నిర్బంధం గురించి ఎటువంటి సమాచారాన్ని అందించలేదు. చివరకు విక్టోరియా తమ కస్టడీలో ఉందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మే నెలలో ఆమె తండ్రికి రాసిన లేఖలో అంగీకరించింది. విక్టోరియా మరణానికి సంబంధించిన సమాచారం ధృవీకరించినట్లు ఉక్రెయిన్‌ యుద్ధ ఖైదీల సమన్వయ ప్రధాన కార్యాలయం ప్రతినిధి పెట్రో యాట్సెంకో చెప్పారు. 

ఆమె ఎలా చనిపోయిందనే దానిపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. 2014లో ఉక్రెయిన్‌ నుండి రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియాలో, అలాగే రష్యా నిధులతో వేర్పాటువాదులు స్వాధీనం చేసుకున్న తూర్పు ఉక్రెయిన్‌ ప్రాంతాల్లో జీవితం గురించి విక్టోరియా అనేక కథనాలను రాశారు. 2022 ఫిబ్రవరిలో మాస్కో పూర్తి స్థాయి ఆక్రమణను ప్రారంభించిన తరువాత ఆమె పలు కథనాలు డాక్యుమెంట్‌ చేశారు. దేశం యుద్ధం ప్రారంభించిన కొద్దికాలానికే రష్యన్లు ఆమెను మొదట 10 రోజుల పాటు నిర్బంధించారు. ఆ తరువాత వదిలిపెట్టారు. 2022లో ఆమెకు ఇంటర్నేషనల్‌ ఉమెన్స్‌ మీడియా ఫౌండేషన్‌ ‘కరేజ్‌ ఇన్‌ జర్నలిజం’ అవార్డు ఇచ్చి సత్కరించింది. 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి