Breaking News

Russia-Ukraine war: మూడేళ్లలో 1,65,000 మంది రష్యా సైనికులు మృతి

Published on Thu, 02/27/2025 - 06:38

మాస్కో: ఉక్రెయిన్‌తో పోరాడుతూ 165,000 సైనికులు మరణించారని రష్యన్‌ స్వతంత్ర వార్తా సైట్‌ మీడియాజోనా ప్రకటించింది. అందులో 95,000 మందికి పైగా సైనికుల వివరాలను పేర్లతో సహా వెల్లడించింది. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం మూడేళ్లయిన సందర్భంగా సైనికుల మరణాలకు సంబంధించిన చిత్రాలు, అధికారిక సమాచారంతో కూడిన కథనాన్ని మీడియాజోనా సోమ వారం ప్రచురించింది. రష్యన్‌ కళాకారుడు వాసిలీ వెరెష్చాగిన్‌ 1,871లో ‘ది అపోథియోసిస్‌ ఆఫ్‌ వార్‌’చిత్రాన్ని వేలాది మంది సైనికుల ఫొటోల గ్రాఫిక్స్‌తో రూపొందించింది. 

ప్రతి ఎంట్రీలో సైనికుడి వయస్సు, మరణించిన తేదీ, ప్రాంతం, యూనిట్, అందుబాటులో ఉంటే ఫొటోలను కూడా ప్రచురించింది. ఇక ఈ ఏడాది ఇప్పటివరకు రష్యన్‌ మరణాల సంఖ్యను 393గా పేర్కొంది.రష్యన్ల మరణాల సంఖ్య ప్రతి సంవత్సరం దాదాపు రెట్టింపవుతూ వచ్చిందని వెల్లడించింది. తమ విశ్లేషణ ప్రకారం 2024 యుద్ధంలో అత్యంత రక్తసిక్త సంవత్సరమని పేర్కొంది. 2022లో సుమారు 20,000, 2023లో సుమారు 50,000 మంది మరణించగా.. ఒక్క 2024లో 1,00,000 మంది చనిపోయాడని వెల్లడించింది. బీబీసీ రష్యన్‌ సర్వీస్, వలంటీర్ల బృందం సహకారంతో జాబితాను రూపొందించామని తెలిపింది.  

మౌనం వహించిన ప్రభుత్వం...  
దీనిపై వ్యాఖ్యానించడానికి క్రెమ్లిన్‌ నిరాకరించింది. ఈ ప్రచురణ గురించి తనకు తెలియదని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ అన్నారు. మరణాల సంఖ్యను ధ్రువీకరించలేదు, అలాగని ఖండించనూ లేదు. ఇది నిజమో కాదో తనకు తెలియదని, మృతుల సంఖ్య సమాచారం రక్షణ మంత్రిత్వ శాఖ ప్రత్యేక హక్కని ఆయన అన్నారు. యుద్ధానికి సంబంధించిన మరణాల గణాంకాలను రష్యా చాలా అరుదుగా ఇస్తోంది. 2022 సెపె్టంబర్లో జరిగిన యుద్ధంలో 5,937 మంది సైనికులు మరణించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ అప్పట్లో తెలిపింది. మీడియాజోనాను రష్యన్‌ ప్రతి పక్ష కార్యకర్త ప్యోటర్‌ వెర్జిలోవ్‌ స్థాపించారు. కాగా, రష్యా ప్రభుత్వం మీడియాజోనాను ‘విదేశీ ఏజెంట్‌’గా ప్రకటించింది. వెర్జిలోవ్‌ను తీవ్రవాదుల జాబితాలో చేర్చింది. సైన్యం గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారని దోషిగా నిర్ధారించింది. 

మా సైనికులు 46 వేల మంది మరణించారు: జెలెన్‌స్కీ 
రష్యాతో యుద్ధంలో 46,000 మందికి పైగా ఉక్రెయిన్‌ సైనికులు మరణించారని, సుమారు 3,80,000 మంది గాయపడ్డారని అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ప్రకటించారు. ఇతర అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు. కాగా, 70,000 మంది చనిపోయారని, 35,000 మంది గల్లంతయ్యారని తమ సైనిక వర్గాలు అంచనా వేశాయని స్వతంత్ర ఉక్రేనియన్‌ వార్‌ కరస్పాండెంట్‌ యూరీ బుటు సోవ్‌ డిసెంబరులో చెప్పారు. 
 

Videos

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!

మీ పాదయాత్రలో పాల్గొంటే DSC ఉద్యోగాలు పంచేస్తారా?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు