Breaking News

ట్రంప్‌తో చర్చలకు పుతిన్‌ రెడీ: రష్యా

Published on Fri, 01/24/2025 - 20:57

మాస్కో: డొనాల్డ్‌ ట్రంప్‌తో మాట్లాడేందుకు తమ అధ్యక్షుడు పుతిన్‌ సిద్ధంగా ఉన్నారని రష్యా ప్రకటించింది. అయితే ఈ విషయమై అమెరికా నుంచి స్పందన కోసం వేచి చేస్తున్నట్లు తెలిపింది. ఇరు దేశాల అధినేతల మధ్య భేటీ త్వరలో ఉంటుందా లేదా అన్న విషయంపై మాత్రం రష్యా స్పష్టత ఇవ్వలేదు.

దావోస్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో ట్రంప్‌ వర్చువల్‌గా మాట్లాడారు. అణ్వాయుధాలను తగ్గించే దిశగా ప్రపంచ దేశాలు పని చేయాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. రష్యా,చైనాలు కూడా వారి అణ్వాయుధ సామర్థ్యాలను తగ్గించుకోవడానికి మద్దతిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఉక్రెయిన్‌ యుద్ధానికి వీలైనంత త్వరగా ముగింపు పలుకుతానన్న ఆయన చమురు ధరలు దిగివస్తే ఈ యుద్ధం మరింత వేగంగా ముగిసిపోతుందని చెప్పారు. అయితే ట్రంప్‌ చేస్తున్న ఈ వాదనతో రష్యా మాత్రం ఏకీభవించలేదు. చమురు ధరలకు తాము యుద్ధం ఆపడానికి సంబంధం లేదని స్పష్టం చేసింది.

అమెరికా-రష్యా సంబంధాలు ఉక్రెయిన్‌ యుద్ధంతో అత్యంత దారుణంగా క్షీణించాయి. రష్యాతో పోరాడుతున్న జెలెన్‌స్కీ సైన్యానికి మాజీ అధ్యక్షుడు బైడెన్‌ హయాంలో అమెరికా భారీ స్థాయిలో ఆయుధ సాయంతో పాటు ఆర్థికంగానూ ఆదుకుంటోంది.

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)