Breaking News

ఉగ్రవాదిగా ఆ దిగ్గజం! ఇది పుతిన్‌ ఆడే చదరంగం

Published on Thu, 03/07/2024 - 21:31

ప్రత్యర్థుల అణచివేతకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఎందాక అయినా వెళ్తారని కళ్లారా చూస్తున్నదే!. నావల్నీ మరణం.. అందుకు ఒక ఉదాహరణ. తాజాగా  చెస్ దిగ్గ‌జం గ్యారీ కాస్ప‌రోవ్‌Garry Kasparovను ర‌ష్యా ఉగ్ర‌వాదుల జాబితాలో చేర్చడం.. ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. పుతిన్ ప్ర‌భుత్వంపై ఆయ‌న బ‌హిరంగంగా విమ‌ర్శ‌లు గుప్పించ‌డ‌మే అందుకు ప్ర‌ధాన కార‌ణమని ఇక్కడ చెప్పనక్కర్లేదు. అసలు 'ఉగ్ర‌వాదులు, తీవ్రవాదులు' లిస్టులో చేరడానికి రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ ఎలాంటి విధానాలు పాటిస్తోంది?..  

ఉగ్రవాదులు-అతివాదుల జాబితాలో చేరడానికి ప్రత్యేకించి అర్హతలేమీ అక్కర్లేదు. పుతిన్‌ ప్ర‌భుత్వ విధానాలను వ్యతిరేకిస్తే చాలూ. ఇలాగే ఇప్పుడు కాస్ప‌రోవ్ పేరును తీవ్రవాదులు-ఉగ్రవాదుల జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్‌పై ర‌ష్యా సైనిక చ‌ర్య‌ను సైతం ఈ చెస్‌ మాజీ ఛాంపియన్‌ బహిరంగంగానూ ఖండిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రోస్‌ఫిన్‌మానిట‌రింగ్ (ర‌ష్యా ఆర్థిక ప‌ర్య‌వేక్ష‌ణా సంస్థ‌)  విడుద‌ల చేసిన ఉగ్ర‌వాదుల జాబితాలోకి గ్యారీ కాస్ప‌రోవ్‌ పేరు చేరింది. 

గ్యారీ కాస్ప‌రోవ్ ప్ర‌భుత్వ అణ‌చివేత విధానాల‌కు భ‌య‌ప‌డి 2014లోనే ఆయ‌న ర‌ష్యా నుంచి వెళ్లిపోయారు. ప‌దేళ్లుగా అమెరికాలోనే ఉంటున్నారు. 2022లో ర‌ష్యా న్యాయ‌శాఖ ఆయ‌న‌పై విదేశీ ఏజెంట్ అనే ముద్ర కూడా వేసింది. తాజాగా.. ఈ జాబితాలో ఆయన పేరును చేర్చడం వల్ల ఆయన ఆర్థిక లావాదేవీలపై తీవ్ర ఆంక్షల్ని విధించేందుకు రష్యాకు అవకాశం ఉంటుంది. 

కాగా, గ్యారీ కాస్ప‌రోవ్‌పై పుతిన్ స‌ర్కార్ తీసుకున్న చ‌ర్య‌ల‌ను హ‌క్కుల సంఘాలు త‌ప్పుబ‌డుతున్నాయి. అణ‌చివేత‌కు ఈ ఆంక్ష‌ల‌ను ర‌ష్యా ప్ర‌భుత్వం ఆయుధంగా ఉప‌యోగిస్తుంద‌ని మండిప‌డుతున్నాయి.

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)