Breaking News

ఆంక్షలపై సమష్టి సమరం

Published on Wed, 06/19/2024 - 04:37

సియోల్‌: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఉత్తరకొరియాలో రెండు రోజుల పర్యటనకుగాను బుధవారం ఉదయం ఆ దేశ రాజధాని ప్యాంగ్యాంగ్‌ చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆయనకు ఘన స్వాగతం పలికారు.   అమెరికా సారథ్యంలో రష్యా, ఉ.కొరియాలపై కొనసాగుతున్న ఆంక్షలను ఇరుదేశాలు సమష్టిగా ఎదుర్కొంటాయని  పుతిన్‌ ప్రకటించారు. ఉ.కొరియా పర్యట నకు కొద్ది గంటల ముందు ఆయన ఆ దేశ అధికారిక వార్తా సంస్థకు రాసిన వ్యాసంలో పలు అంశాలను  ప్రస్తావించారు.

‘‘ ఉక్రెయిన్‌ విషయంలో మా సైనిక చర్యలను సమర్థిస్తూ, సాయం చేస్తున్న ఉ.కొరి యాకు కృతజ్ఞతలు. బహుళ «ధ్రువ ప్రపంచం సాకారం కాకుండా అవరోధాలు సృష్టిస్తున్న పశ్చిమదేశాలను అడ్డుకుంటాం. పశ్చిమదేశాల చెప్పుచేతల్లో ఉండకుండా సొంత వాణిజ్యం, చెల్లింపుల వ్యవస్థలను రష్యా, ఉ.కొరియాలు అభివృద్ధి చేయనున్నాయి. పర్యాటకం, సాంస్కృతికం, విద్యారంగాలకూ ఈ అభివృద్ధిని విస్తరిస్తాం’’ అని పుతిన్‌ అన్నారు.

ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధ జ్వాలలను మరింత రగిల్చేందుకు కావాల్సిన ఆయుధ సంపత్తిని ఉ.కొరియా సమకూర్చుతుండగా, ఆ దేశానికి అణ్వస్త్ర సామర్థ్యం, క్షిపణుల తయారీ,  సాంకేతికతలను రష్యా అందిస్తోందని అమెరికాసహా పశ్చిమ దేశాలు ఆరోపిస్తుండటం తెల్సిందే. ఈ ఆరోపణలను రష్యా, ఉ.కొరియా  కొట్టిపారేశాయి. పుతిన్‌ పర్యటన వేళ  ఈ ఆయుధ సాయం,  టెక్నాలజీ సాయం మరింత పెచ్చరిల్లే ప్రమాదముందని అమెరికా  ఆందోళన వ్యక్తంచేసింది. 

ఉక్రెయిన్‌తో ఆగదు: అమెరికా
‘ఉ.కొరియా బాలిస్టిక్‌ క్షిపణు లే ఉక్రెయిన్‌ను ధ్వంసంచేస్తున్నాయి. రష్యా, ఉ.కొరియా బంధం దుష్ప్ర భావం ఉక్రెయిన్‌కు మాత్రమే పరిమితం కాబోదు కొరియా ద్వీపకల్పంపై పడు తుంది’ అని అమెరికా ప్రతినిధి జాన్‌ కిర్బీ ఆందోళన వ్యక్తంచేశారు. ‘మండలి తీర్మానాలు, శాంతి, సుస్థిరతలకు విఘాతం కల్గించే రీతిలో రష్యా, ఉ.కొరియా సహకారం పెరగొద్దు’ అని దక్షిణకొరియా హెచ్చరించింది. చెత్త నింపిన బెలూన్లను ద.కొరియా పైకి ఉ.కొరియా వదలడం  విదితమే.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)