Breaking News

ఉక్రెయిన్‌ పవర్‌గ్రిడ్‌పై రష్యా దాడులు.. టార్గెట్‌ అదేనా..?

Published on Sun, 11/17/2024 - 16:22

కీవ్‌:ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సహా పలు ప్రాంతాలపై ఆదివారం(నవంబర్‌ 17) రష్యా భారీ దాడులు చేసింది. శీతాకాలం వస్తుండడంతో ఉక్రెయిన్‌కు కీలకమైన పవర్‌ గ్రిడ్‌ను లక్ష్యంగా చేసుకొని క్షిపణులతో దాడులు చేసింది. ఉక్రెయిన్‌పై ఆగస్టు నుంచి ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం. 

ఈ దాడిలో ఉక్రెయిన్‌ పవర్‌గ్రిడ్‌ తీవ్రంగా దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. దీంతో కీవ్‌ సహా పలు జిల్లాలు,నగరాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దేశ విద్యుత్తు సరఫరా,ఉత్పత్తి వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని ఉక్రెయిన్‌ ఎనర్జీ మంత్రి గెర్మన్‌ వెల్లడించారు. మరోవైపు రాజధాని కీవ్‌లో భారీగా పేలుళ్లు జరిగాయి.

ఇక్కడి సిటీ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఆస్తి ప్రాణ నష్ట వివరాలు ఇంకా తెలియరాలేదు. చాలా రోజుల తర్వాత రష్యా తాజాగా ఉక్రెయిన్‌పై భారీ దాడులకు దిగడంతో సరిహద్దుల్లోని పోలండ్‌ పూర్తిగా అప్రమత్తమైంది. రష్యా, ఉక్రెయిన్‌లలో శీతాకాలం అత్యంత తీవ్రంగా ఉంటుంది.

ఈ సీజన్‌లో ఇళ్లలో వేడి కోసం విద్యుత్తు,గ్యాస్‌ వంటి వాటిని వాడతారు.విద్యుత్‌ సరఫరాలో గనుక అంతరాయం ఏర్పడితే చలికి తట్టుకోలేక ఉక్రెయిన్‌లో చాలా మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే రష్యా పవర్‌గ్రిడ్‌ను లక్ష్యంగా చేసుకుందనే అనుమానాలున్నాయి.

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)