Breaking News

అత్యంత భారీ బాలిస్టిక్ క్షిపణుల దాడులు చేసిన రష్యా

Published on Sun, 07/19/2026 - 16:43

రష్యా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై వరుసగా బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడుల్లో ఒకరు మరణించగా, 14 మంది గాయపడినట్టు అధికారులు తెలిపారు. గత రాత్రి వేళ ప్రాంతంలోని పలు చోట్ల దాడులు జరిగాయి. పూర్తి స్థాయి యుద్ధం మొదలైనప్పటి నుంచి కీవ్‌పై జరిగిన అత్యంత భారీ బాలిస్టిక్ దాడుల్లో ఇది ఒకటని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ చెప్పారు.

ఉక్రెయిన్ సైన్యం తెలిపిన వివరాల ప్రకారం, 41 క్షిపణుల్లో 18 క్షిపణులను గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయి. మరో 108 డ్రోన్లను కూడా అడ్డుకున్నాయి. అటు ఉక్రెయిన్ కూడా రష్యాలోని లక్ష్యాలపై దాడులు కొనసాగిస్తోంది. స్టావ్రోపోల్ గవర్నర్ మాట్లాడుతూ.. డ్రోన్ దాడి వల్ల ఒక పారిశ్రామిక పార్కులో అగ్నిప్రమాదం సంభవించింది. కీవ్‌పై తాజా దాడుల్లో ఇస్కాండర్, హైపర్‌సోనిక్ జిర్కాన్ క్షిపణులతో పాటు 125 డ్రోన్లను కూడా రష్యా వినియోగించిందని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది.

ఆదివారం కీవ్ మేయర్ విటాలీ క్లిచ్‌కో మాట్లాడుతూ.. ఈ దాడుల్లో నివాస భవనాలు, ఇతర భవనాలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఒక సూపర్ మార్కెట్, ఒక వసతి గృహం కూడా నష్టం చవిచూశాయని అన్నారు. రెండు గిడ్డంగుల్లో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చే పనిలో ఉన్నారు.

గత వారం ఉక్రెయిన్‌పై రష్యా సుమారు 1,450 దాడి డ్రోన్లు, 1,640కు పైగా బాంబులు, 99 రకాల క్షిపణులను ప్రయోగించిందని టెలిగ్రామ్‌లో జెలెన్స్కీ పేర్కొన్నారు. రాత్రి జరిగిన ఈ దాడులకు ముందు, రష్యాలోని అతిపెద్ద ఆన్‌లైన్ రిటైలర్ వైల్డ్‌బెర్రీస్‌కు చెందిన రెండు గిడ్డంగులను ఉక్రెయిన్ డ్రోన్లతో ధ్వంసం చేసింది. ఈ ఘటనలో 8 మంది మరణించగా, భారీ అగ్నిప్రమాదాలు సంభవించాయి.

మాస్కోకు ఆగ్నేయంగా సుమారు 475 కిలోమీటర్ల దూరంలో ఉన్న టాంబోవ్ నగరంలోని ఒక కేంద్రంలో ఏడుగురు మరణించగా, 25 మంది గాయపడ్డారు. రాజధాని సమీపంలోని ఎలెక్ట్రోస్టాల్‌లో ఉన్న మరో వైల్డ్‌బెర్రీస్ గిడ్డంగిలో ఒకరు మరణించగా, 37 మంది గాయపడ్డారు. శనివారం జెలెన్స్కీ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ చర్యలు రష్యా పౌర మౌలిక సదుపాయాలు, నగరాలు, సమాజాలపై చేసిన దాడులకు ప్రతిస్పందన అని చెప్పారు.

వైల్డ్‌బెర్రీస్‌ను తరచూ రష్యాకు చెందిన అమెజాన్‌గా అభివర్ణిస్తారు. వైల్డ్‌బెర్రీస్‌, ప్రకటనల సంస్థ రస్ కలిసిన ఆర్‌డబ్ల్యుబీ గ్రూప్ విలువను 2026లో ఫోర్బ్స్ రష్యా సుమారు $12.6 బిలియన్ (£9.3 బిలియన్)గా అంచనా వేసింది.

ఇటీవలి కాలంలో రష్యా కీలక ఇంధన మౌలిక సదుపాయాలపై దీర్ఘ శ్రేణి డ్రోన్ దాడులను ఉక్రెయిన్ మరింత తీవ్రం చేసింది. దీని వల్ల విస్తృత స్థాయిలో ఇంధన కొరత ఏర్పడింది. ఈ నెల ప్రారంభంలో రష్యా చమురు శుద్ధి సామర్థ్యంలో దాదాపు 43% పనిచేయకుండా చేశామని కీవ్ ప్రకటించింది.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)