Breaking News

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు.. విద్యుత్‌ సంక్షోభం

Published on Mon, 06/03/2024 - 20:55

ఉక్రెయిన్‌పై మరోసారి క్షిపణులతో విరుచుకుపడింది రష్యా. పవర్‌ ప్లాంట్‌లే లక్ష్యంగా దాడులు ముమ్మరం చేసింది. దీంతో ఉక్రెయిన్‌ వ్యాప్తంగా విద్యుత్‌ సంక్షోభం నెలకొంది. అనేక ప్రాంతాల్లో చీకట్లు అలుముకున్నాయి.

ఉక్రెయిన్‌పై రష్యా నిరంతర దాడులను కొనసాగిస్తూనే ఉంది. క్షిపణి దాడులతో  ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా ఇంధన మౌలిక సదుపాయాలపై  దాడి చేసింది మాస్కో సైన్యం. తూర్పు డొనెట్స్క్ ప్రావిన్స్‌లోని పలు పవర్‌ ప్లాంట్లను ధ్వంసం చేసింది. దీంతో ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

దీనిపై ఉక్రెయిన్ ప్రభుత్వ విద్యుత్ గ్రిడ్ ఆపరేటర్ స్పందించారు. రష్యా దాడులతో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం వచ్చిందని చెప్పారు. పారిశ్రామిక, గృహ వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారంటూ వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఉక్రెయిన్ పవర్ గ్రిడ్‌పై రష్యా చేస్తున్న దాడులు దేశవ్యాప్తంగా బ్లాక్‌అవుట్‌ను విధించేలా చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక.. రష్యా దాడుల్లో 19 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.

గత ఏప్రిల్‌లోనూ పవర్‌ ప్లాంట్‌పై దాడి చేసింది రష్యా. కీవ్‌లోని భారీ థర్మల్ పవర్ ప్లాంట్‌పై అటాక్‌ చేసింది. మే 8న మరో  పవర్‌ ప్లాంట్‌ను టార్గెట్‌ చేసి దాడి చేసింది. రష్యా దాడులతో పలు ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. మరోవైపు డొనెట్స్క్ ప్రాంతంలోని ఉమాన్స్కే గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు రష్యా  ప్రకటించింది. రష్యా ఇప్పుడు ఉత్తర సుమీ, చెర్నిహివ్ ప్రాంతాలలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని ఉక్రెయిన్‌ అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చైనాపై తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటి వరకు పరోక్షంగా చైనాపై ఆరోపణలు చేసిన జెలెన్‌స్కీ.. ఇప్పడు డైరెక్ట్‌గానే అటాక్‌ చేశారు. రష్యాకు చైనా సాయం చేస్తోందంటూ మండిపడ్డారు. పుతిన్‌ చేతిలో డ్రాగన్‌ ఓ ఆయుధంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్విట్జర్లాండ్‌లో జరగనున్న శాంతి సదస్సులో ఇతర దేశాలు హాజరుకాకుండా చైనా తన పరపతిని వినియోగిస్తోందని ఫైరయ్యారు.

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)