Breaking News

భారతీయులను రిక్రూట్‌ చేసుకోవడానికి  రష్యా కంపెనీల ఆసక్తి 

Published on Tue, 08/26/2025 - 04:45

మాస్కో: రష్యాలోని కంపెనీలు, ముఖ్యంగా యంత్రాలు, ఎల్రక్టానిక్స్‌ రంగాలకు చెందిన కంపెనీలు భారతీయులను రిక్రూట్‌ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయని రష్యాలోని భారత రాయబారి వినయ్‌ కుమార్‌ అన్నారు. వచ్చిన వారిలో ఎక్కువ మంది నిర్మాణ, వస్త్ర రంగాల్లో పనిచేస్తున్నారని, కానీ యంత్రాలు, ఎల్రక్టానిక్స్‌ విభాగాల్లో భారతీయులకు డిమాండ్‌ బాగా ఉందని వెల్లడించారు. 

ఆ దేశీయ వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. రష్యాలోని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఎక్కువ మంది భారతీయులు వస్తుండటంతో కాన్సులర్‌ సేవల పనిభారం పెరుగుతోందన్నారు. అమెరికా, కెనడా, యూకే సహా పాశ్చాత్య దేశాల్లో వలసలపై పెరుగుతున్న అణిచివేత మధ్య ఈ వ్యాఖ్యలు వచ్చాయి. రష్యాలో పెరుగుతున్న భారతీయ కార్మీకుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని కాన్సులర్‌ సైతం తమ సేవలను విస్తరింపజేస్తోందన్నారు.  

రష్యాలో పెరుగుతున్న భారతీయుల సంఖ్య
రష్యాలో భారతీయుల సంఖ్య పెరుగుతోంది. విద్యార్థులు, వివిధ రంగాల్లోని నిపుణులు, కార్మీకులు గణనీయమైన కార్మిక లోటును పూడ్చుతున్నారు. భారత రాయబార కార్యాలయం ఇచ్చిన డేటా ప్రకారం ప్రస్తుతం రష్యాలోని భారతీయుల సంఖ్య 14,000 గా ఉంది. అదనంగా, భారత సంతతికి చెందిన దాదాపు 1,500 మంది ఆఫ్ఘన్‌ జాతీయులు ఉన్నారు.

 ఇక ఇటీవలి కాలంలో రష్యాలోని వైద్య, సాంకేతిక సంస్థల్లో సుమారు 4,500 మంది భారతీయ విద్యార్థులు చేరారని తెలుస్తోంది. వారిలో 90 శాతం మంది దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 20 విశ్వవిద్యాలయాలు/సంస్థలలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. మిగిలిన వారు ఇంజనీరింగ్, ఏరోనాటికల్‌ డిజైనింగ్, కంప్యూటర్‌ సైన్స్, రవాణా సాంకేతికత, మేనేజ్‌మెంట్, వ్యవసాయం, బిజినెస్‌/ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ వంటివి చదువుతున్నారు.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)