Breaking News

రష్యా అణు విన్యాసాలు

Published on Thu, 10/23/2025 - 06:41

మాస్కో: ఉక్రెయిన్‌–రష్యా యుద్ధాన్ని ముగించే విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, రష్యా అధినేత పుతిన్‌ మధ్య హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో జరగాల్సిన భేటీ అనూహ్యంగా రద్దయ్యింది. ఈ సమావేశం ఎప్పుడు జరుగుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అసలు జరుగు తుందో లేదో కూడా తెలియడం లేదు. ట్రంప్‌ను కలుసుకోవడానికి పుతిన్‌ ఇష్టపడడం లేదని సమాచారం. 

ఈ నేపథ్యంలో పుతిన్‌ బుధవారం రష్యా వ్యూహాత్మక అణు దళాల విన్యాసాలను పర్యవేక్షించడం గమనార్హం. ఈ విషయాన్ని పుతిన్‌ టీవీలో ప్రకటించారు. అలాగే ఆయన రష్యా సైనికాధికారులను ఉద్దేశించి ఆన్‌లైన్‌లో మాట్లాడారు. న్యూక్లియర్‌ డ్రిల్స్‌లో భూఉపరితలం, సముద్రం, గగనతలానికి సంబంధించిన దళాలు పాల్గొన్నట్లు తెలిపారు. ఈ విన్యాసాల్లో భాగంగా ఖండాంతర బాలిస్టిక్‌ మిస్సైళ్లు, గగనతల క్రూయిజ్‌ మిస్సైళ్లను ప్రాక్టికల్‌గా ప్రయోగించినట్లు రష్యా అధికార వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. 

పుతిన్‌ స్వయంగా పర్య వేక్షించారని పేర్కొన్నాయి. వ్యూహాత్మక అణు జలాంతర్గామి బ్రియాన్స్‌క్, టీయూ 095 ఎంఎస్‌ వ్యూహాత్మక బాంబర్లు సైతం ఇందులో పాల్గొన్నట్లు తెలిపాయి. పుతిన్, ట్రంప్‌  భేటీపై ప్రస్తుతానికి తమ కు ఎలాంటి సమాచారం లేదని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్‌ స్పష్టంచేశారు. పుతిన్‌తో సమావేశంపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం ప్రకటించారు. మరోవైపు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మధ్య జరగాల్సిన సమావేశం కూడా నిరవధికంగా వాయిదా పడడం గమనార్హం.       
 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)