Breaking News

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ ఖైదీల మార్పిడి

Published on Sun, 06/02/2024 - 11:25

సుదీర్ఘ కాలం తర్వాత రష్యా, ఉక్రెయిన్‌లు ఒక కీలక ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇది పలు కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది. యుద్ధం మధ్య రష్యా, ఉక్రెయిన్‌లు తీసుకున్న ఈ నిర్ణయం  అభినందనీయమని పలు దేశాలు పేర్కొంటున్నాయి.

ఉక్రెయిన్‌- రష్యాలు తాజాగా యుద్ధ ఖైదీలుగా ఉన్న  ఇరు దేశాలకు చెందిన చెరో 75 మంది సైనికులను పరస్పరం మార్పిడి చేసుకున్నాయి. ఈ విషయాన్ని అధికారులు మీడియాకు తెలియజేశారు. గత మూడు నెలల్లో ఇరు దేశాల మధ్య యుద్ధ ఖైదీల మార్పిడి జరగడం ఇదే తొలిసారి.

నలుగురు ఉక్రేనియన్ పౌరులతో సహా ఈ యుద్ధ ఖైదీలను ఉత్తర సుమీ ప్రాంతానికి పలు బస్సులలో తరలించారు. బస్సు దిగిన వెంటనే వారు ఆనందంతో కేకలు వేయడంతో పాటు, కుటుంబసభ్యులకు ఫోన్ చేసి తాము స్వదేశానికి తిరిగి వచ్చిన విషయాన్ని తెలియజేశారు. వీరిలోకి కొందరు మోకాళ్లపై వంగి నేలను ముద్దాడటం కనిపించింది. మరికొందరు పసుపు, నీలి రంగు జెండాలను పట్టుకుని ఒకరినొకరు కౌగిలించుకుని రోదించారు.

ఈ విధమైన యుద్ధ ఖైదీల మార్పిడికి ముందు, ఇరుపక్షాలు సైనికుల మృతదేహాలను పరస్పరం అప్పగించుకున్నాయని, ఫిబ్రవరి 2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత ఇలా జరగడం ఇది 52వ సారని అధికారులు తెలిపారు. ఉక్రేనియన్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి  ఇప్పటివరకూ మొత్తం 3,210 మంది ఉక్రేనియన్ సైనిక సిబ్బంది, పౌరులు స్వదేశానికి తిరిగి వచ్చారు.

Videos

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు