Breaking News

మొరాకోలో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి.. 

Published on Mon, 08/07/2023 - 08:49

రాబాత్: మొరాకోలో ప్యాసింజర్లతో వెళ్తోన్న ఓ బస్సు ప్రమాదకరమైన మలుపు వద్ద వేగంగా వెళ్లడంతో బోల్తా కొట్టింది. ప్రమాదంలో 24 మందిమృతి చెందినట్లు తెలిపింది మొరాకో వార్తా సంస్థ(MAP ).    

సెంట్రల్ మొరాకోలోని అజిలాల్ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డెమ్నాట్‌లోని వీక్లీ మార్కెట్‌‌‌‌కు వెళ్తోన్న ఓ బస్సు  రోడ్డు మలుపు వద్ద వేగంగా వెళ్లడంతో ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 24 ముంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం గురించిన సమాచారం అందగానే రాయల్ జెండర్మీర్ పౌర రక్షణ సంస్థ వారు సహాయక చర్యలు చేపట్టారు. 

దర్యాప్తు బృందం సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు ఏమై ఉంటాయా అని విచారణ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో మొరాకోలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఏడాదికి రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణించేవారు సంఖ్య సగటున 3500గా ఉందని, గతేడాది 3200 మంది చనిపోయారని అధికారులు చెబుతున్నారు. 

ఇక ఈ ప్రాంతంలో కూడా తరచుగా ప్రమాదాలు జరుగుతుంటాయని సరిగ్గా గత ఏడాది ఆగస్టులో తూర్పు కాసాబ్లాంకాలో ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకోగా ఆ ప్రమాదంలో 25 మంది మృతి చెందారని అంతకు ముందు 2015లో యువ అథ్లెట్లు ప్రయాణిస్తున్న ఒక బస్సును సెమీ ట్రైలర్ ట్రక్కు ఢీకొట్టడంతో 33 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. 

ఇది కూడా చదవండి: చైనాలో భారీ భూకంపం.. భయంతో జనం పరుగులు.. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)