చైనా రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 22 మంది మృతి

Published on Tue, 04/29/2025 - 19:03

చైనాలోని లియావోయాంగ్‌ నగరంలోని ఓ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 22 మంది మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. రెండు, మూడు అంతస్తుల భవనాల నుంచి భారీగా మంటలు చెలరేగుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

మంటలను అర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ నెలలో చైనాలో జరిగిన రెండో అతిపెద్ద అగ్ని ప్రమాదం ఇది.

ఏప్రిల్‌ 9న ఓ నర్సింగ్‌ హోమ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 20 మంది మృతి చెందారు. చెంగ్డే నగరంలోని లాంగ్‌హువా కౌంటీలో రాత్రి 9 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మొత్తం 20 మంది వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. మంటలు చెలరేగిన సమయంలో ఈ హోమ్‌లో మొత్తం 260 మంది వృద్ధులు ఉన్నారు.

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)