Breaking News

బైడెన్‌పై అభిశంసనకు సిద్ధమైన రిపబ్లికన్లు

Published on Sun, 07/23/2023 - 08:29

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌పై రిపబ్లికన్లు అభిశంసన తీర్మానానికి సిద్ధమయ్యారు. అంతర్జాతీయ లంచం కేసులో అతని ప్రమేయాన్ని వివరించే ఎఫ్‌బిఐ పత్రాలు బయటకు వచ్చిన నేపధ్యంలో బైడెన్‌పై అభిశంసనకు పూనుకున్నారు.

‘వైట్ హౌస్‌లో ఉంటున్న అవినీతి కుటుంబం’
సెనేటర్ చక్ గ్రాస్లీ ఎఫ్‌డీ-1023 ఫారమ్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దానిలో బైడెన్‌, అతని కుమారుడు హంటర్ తాము చేసిన సహాయానికి బదులుగా కైవ్‌కు చెందిన బురిస్మా హోల్డింగ్స్ సీఈఓను మిలియన్ల డాలర్లు చెల్లించాలని ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించారు. ప్రతినిధి జిమ్ బ్యాంక్స్ ట్విట్టర్‌లో ఈ పత్రాలను తిరిగి పోస్ట్ చేస్తూ, వైట్ హౌస్‌లో ఉంటున్న అత్యంత అవినీతి కుటుంబం అని ఆరోపించారు. వీరి అవినీతి ఏ ‍స్థాయిలో ఉందో తెలుసుకోవాలంటే దీనిని చదివి తెలుసుకోండి. బైడెన్‌ను వెంటనే పదవి నుండి తొలగించాలని అతను కోరారు. 

‘బైడెన్‌ నేరాలకు రుజువులున్నాయి’
గ్రాండ్ ఓల్డ్ పార్టీకి చెందిన ఇతర నాయకులు ఈ అభిశంసనకు వంతపాడారు. 80 ఏళ్ల అధ్యక్షుడిని గద్దె దించాలని డిమాండ్ చేశారు. బైడెన్‌ ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధంలో అమెరికా తరపున పాల్గొన్నారు. బైడెన్‌ ఒక నేరస్తుడు. అతను మనల్ని డబ్బ్యుడబ్ల్యు3లోకి నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఉక్రేనియన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పాటు బైడెన్‌లు చేసిన నేరాలకు రుజువు ఉందంటూ ప్రతినిధి మార్జోరీ టేలర్ గ్రీన్ ఆరోపించారు. ఈ విషయంలో రిపబ్లికన్‌లు ఇక జాప్యం చేయలేరు. ఇందుకోసం మాకు 218 రిపబ్లికన్ ఓట్లు అవసరం. నేను మొదటి రోజు నుండి ఇదే మాటపై ఉన్నాను. అమెరికన్ ప్రజలు కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నారని ఆమె పేర్కొన్నారు. మరో ప్రతినిధి ఆండీ బార్ ఇలా రాశారు.. బైడెన్‌ రాజీ పడ్డాడనడానికి ఇది అసలైన సాక్ష్యం. బైడెన్‌ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని పేర్కొన్నారు. 

‘అవి నిరాధార ఆరోపణలు’
వైట్ హౌస్ అధికారులు రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు చేసిన ఆరోపణలను తప్పుబట్టారు. ఆ పత్రాలు నిజానిజాలతో సంబంధం లేకుండా ప్రచురితమయ్యాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ రిపబ్లికన్లు నిజానిజాలతో సంబంధం లేకుండా అధ్యక్షుడు బైడన్‌పై ఆరోపణలు చేయడం సరైనది కాదన్నారు.
ఇది కూడా చదవండి: స్కూలుకు లేదు డుమ్మా.. 50 దేశాలు చుట్టొచ్చిందమ్మా..!
 

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)