Breaking News

పైకి పోలీస్ స్టేషన్.. లోపల భారీ ఆన్‌లైన్ మోసాల కేంద్రం

Published on Sun, 02/08/2026 - 02:31

ఆన్‌లైన్ మోసాలు అనేవి ఎప్పటికప్పుడు వింటూనే ఉంటాయి. మనకు చుట్టుపక్కనోళ్లలోనే ఈ తరహా బాధితులు చాలామందే ఉంటారు. తాజాగా రాయిటర్స్ రిపోర్టర్లు.. థాయ్-కాంబోడియా సరిహద్దు దగ్గరలోని ఓ కాంబోడియా కౌంపౌండ్‌లో భారీ ఆన్‌లైన్ మోసాల కేంద్రాన్ని కనుగొన్నారు. దాన్ని బయటపెట్టారు. ఆ ప్రదేశంలో ఆస్ట్రేలియా, సింగపూర్ పోలీస్ స్టేషన్లలా కనిపించే నకిలీ గదులు, వియత్నాం బ్యాంక్‌లా కనిపించే సెటప్‌లు ఉండటం షాకింగ్‌గా అనిపిస్తోంది.

అలానే సదరు కేంద్రంలో దొరికిన పత్రాల్లో వృద్ధులు, మహిళలు, సమస్యల్లో ఉన్నవారి, బలహీన వర్గాల వివరాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రేమ మోసాలు, పోలీసులుగా నటించి బెదిరించే స్కాములకు సంబంధించిన స్క్రిప్ట్‪‌లు దొరికాయి. ఈ క్రమంలోనే రాయిటర్స్.. ఓ జపాన్ వృద్ధుడిని సంప్రదించగా.. తనకు ఇలాంటి స్కామ్ కాల్ వచ్చిన విషయమే నిజమేనని చెప్పాడు. డబ్బు ఇవ్వకపోయినప్పటికీ.. వ్యక్తిగత సమాచారం చెప్పేశానని ఒప్పుకొన్నాడు.

ఈ స్కామ్ కేంద్రాలు.. బయటకు వ్యాపార సంస్థల్లా నడుస్తున్నాయి. వేర్వేరు స్కామర్ల గ్రూపులకు వీటిలో గదులు అద్దెకిచ్చి, నెలకు వేల డాలర్లు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. అలానే బయట వ్యక్తులు లోపలికి ప్రవేశించకుండా కఠిన నిబంధనలు, భద్రతా సిబ్బంది కూడా ఉన్నాయి. ఆగ్నేయాసియా ఇప్పుడు ప్రపంచ సైబర్ మోసాలకు ప్రధాన కేంద్రంగా మారిందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా చైనా నేరగాళ్లు.. ఎక్కువగా ఈ స్కామ్స్ నడుపుతున్నారు. ఇందులో పనిచేసేవారిలో చాలామంది మానవ అక్రమ రవాణా బాధితులే కావడం విచారకరం.

2024లో ఈ స్కామ్‌ల వల్ల అమెరికన్లు.. దాదాపు 10 బిలియన్ డాలర్లు నష్టపోయారని అంచనా. థాయ్ సైనిక దాడులు, ప్రభుత్వ  చర్యల వల్ల ఇప్పుడు లక్షలాది మంది.. సదరు మోసాల కాంపౌండ్స్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఈ సంఘటనల వల్ల ప్రపంచవ్యాప్తంగా సైబర్ మోసాలు ఎంత పక్కాగా, ప్రమాదకరంగా మారాయో స్పష్టమవుతోంది.

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)