Breaking News

ఇరాన్ యూనివర్సిటీల్లో మళ్లీ నిరసన జ్వాలలు

Published on Sun, 02/22/2026 - 04:20

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా విద్యార్థులు మ‌రోసారి రోడ్లెక్కారు. శ‌నివారం కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన తరుణంలో అనేక విశ్వవిద్యాలయాలలో విద్యార్థులు నిరసనలు తెలిపారు. గత నెలలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలో భద్రతా దళాల అణిచివేత కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరిస్తూ ఆందోళ‌న చేప‌ట్టారు.

టెహ్రాన్‌లోని షరీఫ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలోని విద్యార్థులు భారీ ర్యాలీ చేప‌ట్టారు. అయతుల్లా అలీ ఖమేనీని " అత్యంత క్రూరమైన నాయ‌కుడు"  అని అభివర్ణిస్తూ నినాదాలు చేశారు. అదేవిధంగా ఇరాన్ మాజీ రాజు షా కుమారుడు రెజా పహ్లావిని కొత్త సుప్రీం లీడ‌ర్‌గా బాధ్యతలు చేపట్టాలని విద్యార్థులు కోరడం చర్చానీయాంశ‌మైంది. 

ఈ నేప‌థ్యంలో పలు క్యాంప‌స్‌ల‌లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. నిరసనకారులకు, ప్రభుత్వ మద్దతుదారులైన 'బసీజ్' (Basij) విద్యార్థి విభాగాలకు మ‌ధ్య ప‌లు చోట్ల వాగ్వాదం జ‌రిగింది. టెహ్రాన్‌లోని అమీర్ కబీర్, షాహిద్ బెహెష్టి యూనివర్సిటీలతో పాటు ఈశాన్య ప్రాంతంలోని మషద్ యూనివర్సిటీలో కూడా నిరసనలు జరిగాయి. కాగా 1979 నాటి ఇస్లామిక్ విప్లవం తర్వాత, ఇరాన్ ప్రభుత్వం ఇంతటి భారీ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొవ‌డం  ఇదే మొద‌టిసారి. ఇరాన్ భ‌ద్ర‌తా బ‌ల‌గాలు అణిచివేత‌లో వేల సంఖ్య‌లో నిర‌స‌న‌కారులు ప్రాణాలు కోల్పోయారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)