Breaking News

శిక్షాకాలం లేకుండా తీర్పిస్తా

Published on Sat, 01/04/2025 - 07:37

న్యూయార్క్‌: అమెరికా రాజకీయ చరిత్రలో గతంలో ఎన్నడూ కనివినీ ఎరుగని వింత ఘట్టానికి న్యాయమూర్తి జువాన్‌ ఎం.మర్చన్‌ తెరలేపారు. క్రిమినల్‌ కేసులో దోషిగా తేలిన వ్యక్తిని శిక్షిస్తానంటూనే శిక్షాకాలం విధించబోనని చెప్పి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణంచేయడానికి సరిగ్గా పది రోజుల ముందు జనవరి పదో తేదీ ఉదయం 9.30 గంటలకు సంబంధిత తీర్పు చెప్తానని జడ్జి ప్రకటించారు.

 నీలిచిత్రాల తార స్టార్మీ డేనియల్‌కు అనైతిక నగదు చెల్లింపుల కేసులో దోషిగా తేలిన ట్రంప్‌కు పదో తేదీన శిక్ష ఖరారుచేస్తానని శుక్రవారం న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌ కోర్టు జడ్జి వెల్లడించారు. ‘‘కారాగారంలో జైలుశిక్ష అనుభవించాల్సిన అవసరంలేకుండా ట్రంప్‌ను బేషరతుగా వదిలేస్తూ, కేసుకు ముగింపు పలుకుతూ తీర్పు రాస్తా. అన్‌కండీషనల్‌ డిశ్చార్జ్‌ తీర్పు వినేందుకు ట్రంప్‌ కుదిరితే ప్రత్యక్షంగా లేదంటే వర్చువల్‌గా కోర్టు ఎదుట హాజరవ్వాల్సి ఉంటుంది. 

ట్రంప్‌కు ఎలాంటి ప్రొబేషన్‌ పిరియడ్, జరిమానా విధించబోను’’అని జడ్జి చెప్పారు. గతంలో తనతో శృంగారం జరిపిన విషయం ఎవరికీ చెప్పకుండా దాచేందుకు స్టార్మీ డేనియల్‌కు ట్రంప్‌ తన లాయర్‌ ద్వారా 2016 ఏడాదిలో 1,30,000 డాలర్లు ఇచ్చారు. ఈ నగదును లెక్కల్లో తప్పుగా చూపారు. ఈమెకు నగదు ఇచి్చన విషయాన్ని దాచి ఆ నగదును ఎన్నికల జమా ఖర్చు కింద మార్చిరాశారు. ఈ అనైతిక చెల్లింపును ‘హష్‌ మనీ’గా పేర్కొంటారు. 

ఎన్నికల విరాళాలను ఇలా అక్రమంగా దుర్వినియోగం చేశారని ట్రంప్‌పై కేసు నమోదైంది. ఈ కేసులో 34 అంశాల్లో ట్రంప్‌ దోషిగా తేలిన విషయం విదితమే. జూలై 11వ తేదీనే ట్రంప్‌ కేసు ముగింపుకొచ్చినా అధ్యక్షునిగా గెలిచిన వ్యక్తికి క్రిమినల్‌ కేసు విచారణ నుంచి మినహాయింపు ఉంటుందంటూ ట్రంప్‌ న్యాయవాదులు ఇన్నాళ్లూ వాదిస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఇవన్నీ చెల్లవంటూ న్యాయమూర్తి తన తీర్పున వెలువరించేందుకు సిద్ధమయ్యారు.

 క్రిమినల్‌ కేసులో దోషిగా తేలి శిక్షను ఎదుర్కోబోతున్న మొట్టమొదటి అమెరికా మాజీ, కాబోయే అధ్యక్షుడిగా ట్రంప్‌ చరిత్రలో నిలవబోతున్నారు. తీర్పు వచ్చాక న్యూయార్క్‌ చట్టాల ప్రకారం ట్రంప్‌ తన డీఎన్‌ఏ శాంపిల్‌ను రాష్ట్ర నేర డేటాబ్యాంక్‌కు అందించాల్సి ఉంటుంది. ఒకవేళ ట్రంప్‌కు జడ్జి శిక్ష విధిస్తే పదిరోజుల తర్వాత అధ్యక్షుడి హోదాలో తనకు తాను క్షమాభిక్ష ప్రసాదించుకునే అవకాశం ట్రంప్‌ లేదని అమెరికా రాజ్యాంగం చెబుతోంది. దేశ స్థాయిలో శిక్షలకు మాత్రమే అధ్యక్షుడు క్షమాభిక్ష ప్రసాదించగలడు. న్యూయార్క్‌ రాష్ట్ర కోర్టు ఇచ్చే తీర్పులకు ఇది వర్తించదు.

ఇదీ చదవండి: డాలర్‌ డ్రీమ్స్‌పై మరో పిడుగు
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)