Breaking News

Maldives Row: వారి కుట్రతోనే వివాదం..మాల్దీవుల మాజీ రాయబారి

Published on Fri, 01/12/2024 - 10:28

న్యూఢిల్లీ: భారత్‌, మాల్దీవుల మధ్య సంబంధాలు దెబ్బతినేందుకు అక్కడ అధికారంలో ఉన్న ఇస్లామిక్‌ కన్జర్వేటివ్‌ పార్టీయే కారణం అని మాల్దీవుల్లో గతంలో భారత హై కమిషనర్‌గా పనిచేసిన మనోహర్‌ మూలే తెలిపారు. ‘మాల్దీవుల ప్రజల మనసును కలుషితం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. దీని వెనుక చైనా పాత్ర కీలకంగా ఉంది. పర్యాటక దేశంలోని కన్జర్వేటివ్‌ ఇస్లామిస్టులకు చైనా తన పూర్తి అండదండలందిస్తోంది.

అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కన్జర్వేటివ్‌ ఇస్లామిస్టులు అభివృద్ధి వైపు ఎక్కువ మొగ్గు చూపుతారనే పేరుంది. అదే సమయంలో ఇస్లామిక్‌ భావజాలాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. మహ్మద్‌ మొయిజ్జు మాల్దీవుల్లో అధికారం చేపట్టినప్పటి నుంచి పాలనలో కొంత ఇస్లామిక్‌ రంగు కనిపిస్తోంది.

మొయిజ్జు ప్రధాని అయిన తర్వాత తొలుత టర్కీలో పర్యటించారు. రెండవ పర్యటన కోసం చైనాకు వెళ్లారు. నిజానికి మహ్మద్‌ మొయిజ్జు మాల్దీవుల మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ను అనుసరించే వ్యక్తి అబ్దుల్లా యమీన్‌ కరుడు గట్టిన భారత్‌ వ్యతిరేకి అని తెలిసిందే.ప్రస్తుతం మహ్మద్‌ మొయిజ్జు చేపట్టినట్లుగానే 2015లో అబ్దుల్లా యమీన్‌ ఇండియా అవుట్‌ క్యాంపెయిన్‌ను చేపట్టారు’ అని మనోహర్‌ మూలే వివరించారు. 

ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో తీవ్ర వివాదం రేగింది. వేల సంఖ్యలో భారత పర్యాటకులు తమ మాల్దీవుల పర్యటనలను రద్దు చేసుకున్నారు. సోషల్‌ మీడియాలో బాయ్‌కాట్‌ మాల్దీవులు పిలుపును కూడా ఇచ్చారు. ఈ పిలుపుతో దిగి వచ్చిన మాల్దీవుల ప్రభుత్వం ఆ మంత్రుల వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని పేర్కొంది. మోదీపై వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను మంత్రివర్గం నుంచి సస్పెండ్‌ చేసింది. 

ఇదీచదవండి..హౌతీలపై అమెరికా దాడులు 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)