Breaking News

చాలా బాధ కలిగింది, ప్రతీదీ నిజం కాదు..ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు!

Published on Tue, 11/07/2023 - 16:26

Deeply Disturbed Zara Patel Reacts: నటి రష్మిక మందన్న వైరల్ డీప్‌ఫేక్ వీడియోకు సంబంధించిన ఒరిజినల్‌ వీడియో బ్రిటిష్-ఇండియన్ఇన్‌ఫ్లుయెన్సర్ జారా పటేల్‌దే. ఈ నేపథ్యంలో తన ఫేస్‌తో రష్మిక ముఖంతో ఏఐ ద్వారా క్రియేట్‌ చేసిన డీప్‌ ఫేక్‌ వీడియో వివాదంపై జారా పటేల్‌ స్పందించారు. ఈ సంఘటన తనను చాలా ఆవేదనకు గురిచేసిందన్నారు. ఈ సంఘటనతో ఇంటర్నెట్‌లో  మహిళలు, అమ్మాయిల భద్రతపై  మరింత ఆందోళన కలుగుతోందని  ఆమె సోషల్‌ మీడియాలో  పోస్ట్‌  చేశారు.

ప్రముఖ నటి ముఖాన్ని ఉపయోగించి ఎవరో డీప్‌ఫేక్ వీడియోను రూపొందించినట్లు  తన  దృష్టికి వచ్చిందనీ, ఈ వీడియోతో  తనకు ఎలాంటి  ప్రమేయం లేదంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఈ ఫేక్‌ వీడియో చూసి చాలా  ఆందోళన చెందాను అంటూ జారా పటేల్  ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రష్మికకు తను సానుభూతిని ప్రకటించారు. ఇకపై సోషల్‌ మీడియాలో యువతులు, మహిళలు ఏదైనా పోస్ట్‌ చేయాలంటేనే భయపడాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ఇంటర్నెట్‌లో వస్తున్న ప్రతీదీ నిజం కాదు. దయచేసి  ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి అంటూ ఆమె నెటిజన్లుకు సూచించారు. (రష్మిక డీప్‌ ఫేక్‌ వీడియో: గాయని చిన్మయి శ్రీపాద ఫైర్‌)

కాగా సంచలనం రేపిన టాలీవుడ్‌ నటి రష్మిక డీప్‌ఫేక్‌ వీడియో ఆధునిక టెక్నాలజీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మరో   భయంకర కోణంపై ఆందోళన  రాజేసింది. సోషల్‌ మీడియాలో బిగ్‌బీ, కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ సహా పలువురు ప్రముఖులు స్పందించారు. (రష్మిక డీప్‌ ఫేక్‌ వీడియో: కేంద్ర మంత్రి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ )

హీరోయిన్లు, సెలబ్రిటీ మహిళలతోపాటు, సాధారణ మహిళలు, టీనేజ్‌ అమ్మాయిల ఉనికికి ముప్పుగా మారుతోందంటూ  ప్రముఖ గాయని చిన్మయి  శ్రీపాద, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే.  (రష్మిక డీప్‌ ఫేక్‌ వీడియో : ఎమ్మెల్సీ కవిత రియాక్షన్‌)

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)