Breaking News

సౌదీపై మంచు దుప్పటి

Published on Tue, 12/23/2025 - 05:30

రియాద్‌: ఎటుచూసినా ఇసుక తిన్నెలు, భగభగమండే భానుడి సెగలు, భరించరాని వేడి, అత్యధిక ఉష్ణోగ్రతలకు చిరునామాగా నిలిచే సౌదీ అరేబియా ఎడారుల్లో ఇప్పుడు లెక్కలేనంత మంచు కుప్పలుతెప్పలుగా కనిపిస్తోంది. భారీ వర్షాలతో ముంపు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. చలికాలం కావడంతో రాత్రిపూట ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్టాలకు పడిపోతున్నాయి. దీంతో తమ ఎడారుల్లో మంచు దుప్పట్లు పర్చుకోవడంతో సౌదీ స్థానికులు ఒకింత ఆశ్చర్యానికి, మరికొంద గందరగోళానికి గురవుతున్నారు. 

వాతావరణ మార్పుల విపరిణామాల కారణంగానే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తుంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారు. ఈశాన్య సౌదీలో అత్యధికంగా మంచు కురుస్తోంది. తబుక్‌ ప్రావిన్స్‌లోని పర్వతాలన్నీ ఇసుకరేణువులపై పడిన మంచుతో దవళవర్ణ శోభను సంతరించుకున్నాయి. జిబేల్‌ అల్‌–లావాజ్‌ పరిధిలో సముద్రమట్టానికి 2,600 మీటర్ల ఎత్తులోని ప్రఖ్యాత ట్రోజెనా ప్రాంతం మొత్తం మంచుతో నిండిపోయింది. 

ఎడారి ఓడగా వినతికెక్కిన ఒంటెలన్నీ ఇప్పుడు మంచు చల్లదనాన్ని తెగ ఆస్వాదిస్తున్నాయి. ఎడారి ఇసుకతిన్నెలన్నీ తెలుపురంగులో మిలమిలా మెరిసిపోవడం, ఒంటెల శరీరాల మీదుగా మంచు పేరుకుపోయిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సముద్రమట్టం నుంచి అత్యంత ఎత్తయిన ప్రదేశాల్లో తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు ఏకంగా సున్నా డిగ్రీసెల్సియస్‌కు పడిపోవడం విశేషం. పలు రీజియన్లలో వర్షాలు పడటంతో వాటికి చల్లటిగాలులు తోడై ఉష్ణోగ్రతలను కనిష్టాలకు పరిమితంచేస్తున్నాయి. సౌదీ అరేబియాలో ఇంతటి స్థాయిలో మంచు కురవడం గత 30 ఏళ్లలో ఇదే తొలిసారికావడం గమనార్హం.
 

Videos

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు