Breaking News

వింటర్‌ ఎగ్‌ @ 236 కోట్లు!

Published on Fri, 11/28/2025 - 04:31

లండన్‌: రష్యా జార్‌ చక్రవర్తుల రాజరిక ఠీవీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే అత్యంత అరుదైన వింటర్‌ఎగ్‌ ఒకటి ఇప్పుడు వేలంపాటలో రికార్డ్‌ల మోత మోగించేందుకు సిద్ధమైంది. రష్యా జార్‌ చక్రవర్తి నికోలస్‌–2 తన తల్లి, రాజమాత మారియా ఫియోడోరోవ్‌నాకు వందేళ్ల క్రితం ఈస్టర్‌ కానుకగా బహూకరించిన విలువైన వింటర్‌ ఎగ్‌ గురించే ఇప్పుడా చర్చ అంతా. 

డిసెంబర్‌ రెండో తేదీన క్రిస్టీస్‌ వేలంపాట సంస్థ తమ లండన్‌ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే వేలంపాటలో ఈ స్ఫటిక ఫ్యాబెర్జీ వింటర్‌ ఎగ్‌ ఏకంగా రూ.236 కోట్లకుపైగా ధర పలకవచ్చన్న అంచనాలు ఎక్కువయ్యాయి. దీనిని ప్రఖ్యాత వజ్రాభరణాల సంస్థ ఫ్యాబెర్జీ తయారుచేసింది. 1913 సంవత్సరంలో రాజు నికోలస్‌ దీనిని తన తల్లికి బహూకరించారు. రష్యా ప్రభుత్వ అధీనంలోకాకుండా ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో ఉన్న ఏడింటిలో ఇదీ ఒకటని వేలంసంస్థ పేర్కొంది.

ఎన్నెన్నో ప్రత్యేకతలు
దవళవర్ణంలో ధగధగా మెరిసేపోయే ఈ వింటర్‌ ఎగ్‌ ఎత్తు 10 సెంటీమీటర్లు. లీలగా చూస్తే పూర్తి గుడ్డులాగా కనిపించినా దానిని రెండుభాగాలుగా తెరవొచ్చు. చలికాలంలో ఆరుబయట పెడితే మంచుబిందువులు పడి ఘనీభవించినట్లు స్ఫురించేలా దీనిని డిజైన్‌చేశారు. ప్లాటినమ్‌ లోహపు బుల్లి బుట్టలో అనిమోనిస్‌ పుష్పాలను గుదిగుచ్చి చూడచక్కటి పుష్పగుచ్ఛా న్ని తయారుచేసి లోపల పెట్టారు. 

గుడ్డు అంతర్గ తంగా మొత్తంగా ఏకంగా 4,500 చిన్న చిన్న వజ్రా లను పొదిగారు. అనిమో నిస్‌ పుష్పాలను క్వార్జ్‌తో తయారుచేశారు. ఆకుల ను పచ్చలతో రూ పొందించారు. శీతాకాల చలిని చీల్చుకుంటూ వసంత రుతువులోకి కాలం అడుగుపెట్టేవేళ అనిమో నిస్‌ పుష్పాలు వికసిస్తా యి. కష్టకాలాన్ని దాటి కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నందుకు గుర్తుగా రష్యాలో ఈ పుష్పాలను బహుమతిగా ఇస్తారు. 

ఫ్యాబెర్జీ వజ్రాభరణాల సంస్థలోని ఏకైక కళాకృతి కళాకారిణి ఆల్మా పిహల్‌ దీనిని డిజైన్‌ చేశారు. స్వర్ణకారులైన ఆల్బర్ట్‌ హల్మ్‌స్ట్రోమ్, పిహల్‌ బంధువు దీనిని తయారు చేశారు. ‘‘అద్భుతమైన చేతి పనితనం, ఆకర్షణీ యమైన డిజైన్‌లకు ఈ వింటర్‌ ఎగ్‌ పెట్టింది పేరు. అలంకరణ కళల్లో ఈ ఎగ్‌ ఒకరకంగా మోనాలిసా పెయింటింగ్‌లాంటిది’’ అని క్రీస్టిస్‌ వేలంసంస్థలో రష్యా కళారూపాల విభాగ అధిపతి మార్గో ఒగానేసియన్‌ వ్యాఖ్యానించారు. 

పీటర్‌ కార్ల్‌ ఫ్యాబెర్జీ సారథ్యంలోని వజ్రా భరణాల సంస్థ 1885 నుంచి దాదాపు పాతికేళ్ల పాటు రష్యా రాజకుటుంబాల కోసం దాదాపు 50 స్మారక ఎగ్‌లను తయారు చేసి ఇచ్చింది. జార్‌ చక్రవర్తి అలెగ్జాండర్‌–3 తన సతీమణికి ప్రతి ఈస్టర్‌కు ఒక ఈస్టర్‌ ఎగ్‌ ను బహూకరించి ఇలా ఎగ్‌ల బహూకరణ పర్వానికి తెరలేపారు. దీనిని నికోలస్‌–2 కొనసా గించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)