Breaking News

థాయ్‌లాండ్‌లో అరుదైన దృశ్యం : ఇలా వచ్చి..అలా!

Published on Wed, 02/18/2026 - 13:11

థాయిలాండ్‌లో అరుదైన దృశ్యం  నమోదైంది.  ఆసియా గోల్డెన్ క్యాట్‌గా  పిలిచే  పైర్‌  టైగర్‌ అలా కనిపించి ఇలా మాయమైంది. ఖావో లువాంగ్ నేషనల్ పార్క్ లోపలి  ట్రైల్ కెమెరాలో ఈ అరుదైన దృశ్యాలు రికార్డయ్యాయి.   త ఏడాది జూన్‌ 20న దక్షిణ థాయ్‌లాండ్‌లోని ఖావో లుయాంగ్ నేషనల్ పార్క్‌లో ఏర్పాటు చేసిన ఒక ట్రైల్ కెమెరాలో ఈ అరుదైన వన్యప్రాణి చిక్కింది. దట్టమైన అడవి గుండా నిశ్శబ్దంగా  కదులుతున్న దృశ్యాల ఫుటేజ్ పది  సెకండ్లు మాత్రమే  రికార్డ్ అయ్యింది.


ఈ జాతిని శాస్త్రీయంగా కాటోపుమా టెమ్మింకి అని పిలుస్తారు. ఇది ఆగ్నేయాసియా అడవులకు చెందినది. ఇది మధ్యస్థ పరిమాణంలో,ఒంటరిగా తిరగడానికి ఇష్టపడుతుంది.  పగటిపూట అరుదుగా  కదులుతుంది. దాని కదలికలు రహస్యంగా , నీడలా ఉంటాయి.

దీని శాస్త్రీయ నామం Catopuma temminckii. "అగ్ని పులి" (Fire Tiger) థాయ్‌లాండ్‌లో దీన్ని 'సూవా ఫై' (Seua fai) అని పిలుస్తారు, అంటే "అగ్ని పులి" అని అర్థం.దీని శరీరం బంగారు రంగు  కాంతిలో  మెరుస్తూ ఉండటం వల్ల ఈ పేరు వచ్చింది. అలాగే దీని వెంట్రుకలను కాల్చడం వల్ల పెద్ద పులులు దూరంగా పారిపోతాయని ఒక పురాతన నమ్మకం ఉంది. 

ఇదీ చదవండి: లండన్‌ వీధుల్లో గోరియాదేవి సమోసాలు, ఫన్నీవీడియో వైరల్‌
 

విచక్షణా రహితంగా అడవులను నరకివేయడం, వ్యవసాయం పెరగడం వల్ల  వీటి  జనాభా క్రమంగా తగ్గిపోతోంది. వన్యప్రాణుల అక్రమ రవాణా కోసం లేదా పశువులపై దాడి చేస్తాయనే కోపంతో వీటిని చంపేస్తున్నారు. అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంఘం (IUCN) ఈ జాతిని 'వల్నరబుల్' జాబితాలో చేర్చింది. నిరంతరం నిఘా ఉంచడం, పరిరక్షణ చర్యలు చేపట్టడం ద్వారానే ఈ "అగ్ని పులులను"  కాపాడుకోవాల్సిన అవసరం  ఉందని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు.

ఇదీ  చదవండి: ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో మరో కలకలం : ఉమ్మెత్త పూలతో అరాచకాలు

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)