Breaking News

క్విట్‌ వెకేషనింగ్‌‌ ట్రెండ్‌ ఏమిటి? యువత ఎందుకు ఫాలో చేస్తోంది?

Published on Sat, 05/25/2024 - 10:20

సాధారణంగా ఉద్యోగులు తమ ఉద్యోగానికి, వ్యక్తిగత జీవితానికి మధ్య సమన్వయాన్ని కొనసాగించేందుకు పని నుండి కాస్త విరామం తీసుకుని, ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటారు. ఇందుకోసం తమ ఆఫీసులోని బాస్‌కు చెప్పి సెలవు తీసుకుంటారు. అయితే ఇప్పుడు ఈ విషయంలో కొత్త ట్రెండ్‌ మొదలయ్యింది. ప్రపంచంలోని అనేక దేశాలలో వివిధ ప్రైవేట్‌ కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు ఈ నూతన ట్రెండ్‌ను ఫాలో చేస్తున్నారు. దానిపేరే ‘క్విట్‌ వెకేషనింగ్‌‌’. ఇంతకీ ఈ కొత్త ధోరణి ఏమిటి?

అమెరికన్ మార్కెటింగ్ అండ్‌ రీసెర్చ్ కంపెనీ ‘హారిస్ పోల్’ నిర్వహించిన సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం యూఎస్‌లోని దాదాపు 78 శాతం మంది ఉద్యోగులు, ప్రధానంగా యువత తమకు పని నుంచి విరామం కావాలని బాస్‌ను అడగడం లేదు. ఇలా అడగకుండా లీవ్‌ పెట్టడాన్ని వారు తప్పుగా భావించడంలేదని సదరు సర్వే చెబుతోంది. పని ఒత్తిడికి తగ్గించుకునేందుకే వారు ఇలా చేస్తున్నారని సర్వే వెల్లడించింది.

పని నుంచి విరామం కోరుకునేందుకు ఉద్యోగులు తమకు తోచిన పరిష్కారాలను కనిపెడుతున్నారు. దీనిలో భాగంగానే క్విట్‌ వెకేషనింగ్‌‌ అనేది ఉద్భవించిందని సర్వే చెబుతోంది. ఈ సర్వేలోని వివరాల ప్రకారం క్విట్‌ వెకేషనింగ్‌‌‌ సమయంలో ఉద్యోగులు తాము పనిచేస్తున్నట్లు సంస్థకు భ్రమ కల్పిస్తారు. పని వేళల్లో తాము పంపాల్సిన ఈమెయిల్స్‌ను ముందుగానే షెడ్యూల్ చేస్తారు. పనివేళల తర్వాత కూడా ఓవర్ టైం చేస్తున్నట్లు కనిపించేందుకు కూడా ప్రయత్నిస్తుంటారు.

మరి కొందరు ఉద్యోగులు అప్పుడప్పుడు తమ కంప్యూటర్ మౌస్‌ను కంపెనీ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌పై ఉంచి, పని చేస్తున్నట్లు కనిపించడానికి ప్రయత్నిస్తారు. ఇదంతా తెరవెనుక కొన్నాళ్లుగా జరుగుతున్నదని ఈ సర్వే చేపట్టిన సంస్థ తెలిపింది. అయితే అటు ఉద్యోగాన్ని, ఇటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్‌ చేసేందుకు మంచి పరిష్కార మార్గం కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని సర్వే నిర్వాహకులు తెలిపారు.

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)