Breaking News

ఖతార్‌లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు

Published on Mon, 06/22/2026 - 08:05

రస్ లాఫాన్: ప్రపంచంలోనే అతిపెద్ద ద్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) ఎగుమతి కేంద్రాలలో ఒకటైన ఖతార్‌లోని రస్ లాఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో ఆదివారం (జూన్ 21) అర్ధరాత్రి ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ప్లాంట్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో భారీగా మంటలు ఎగసిపడటంతో  54 మంది కార్మికులు గాయపడ్డారు. మరో 18 మంది కార్మికులు గల్లంతైనట్లు అధికారులు ప్రాథమికంగా ధృవీకరించారు. ఈ పేలుడు ధాటికి దట్టమైన పొగ, నిప్పురవ్వలు ఆకాశాన్ని కమ్మేయగా.. సుదూరంలో ఉన్న రాజధాని దోహావాసులకు సైతం ఈ శబ్దం వినిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

బర్జన్ గ్యాస్ ప్లాంట్‌లో అసలేం జరిగింది?
రస్ లాఫాన్ ప్లాంట్ పరిధిలోని బర్జన్ లోకల్ గ్యాస్ సప్లై ఫెసిలిటీలో మూసివేసిన కార్యకలాపాలను కార్మికులు తిరిగి పునఃప్రారంభిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ యాజమాన్యంలోని 'ఖతార్ ఎనర్జీ' సంస్థ అందించిన సమాచారం ప్రకారం.. ఫ్యాక్టరీ లోపల సంభవించిన సాంకేతిక లోపమే ఈ భారీ పేలుడుకు, ఆ తర్వాత వ్యాపించిన అగ్నిప్రమాదానికి దారితీసింది. సమాచారం అందుకున్న వెంటనే సివిల్ డిఫెన్స్ విభాగానికి చెందిన అత్యవసర రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగి మంటలను అదుపు చేసేందుకు ముమ్మర చర్యలు చేపట్టాయి.

భద్రతపై ఆందోళనలు.. అధికారుల వివరణ
ఈ ప్రమాదంపై ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ  స్పందించింది. చుట్టుపక్కల ప్రాంతాలకు ఎటువంటి ముప్పు లేదని, పబ్లిక్ భద్రతకు భంగం కలిగించేలా ప్రమాదకరమైన గ్యాస్ లీకేజీలేవీ జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే, గతంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య జరిగిన అంతర్జాతీయ ఉద్రిక్తతల సమయంలో ఇరాన్ దాడుల వల్ల రస్ లాఫాన్ ఇంధన మౌలిక సదుపాయాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కానీ, ప్రస్తుత ప్రమాదానికి ఎలాంటి బాహ్య దాడులు కారణం కాదని, ఇది పూర్తిగా అంతర్గత సాంకేతిక లోపం వల్లే జరిగిందని అధికారులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.

గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌పై ప్రభావం ఎంత?
ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ఎల్‌ఎన్‌జీ  మార్కెట్‌లో ఖతార్ అత్యంత కీలకమైన భాగస్వామి. రస్ లాఫాన్ ప్లాంట్‌లో జరిగే చిన్నపాటి అంతరాయమైనా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను, గ్యాస్ ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతానికి అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలంలోనే ఉండి భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ సాంకేతిక లోపానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు, ప్లాంట్‌కు జరిగిన ఆస్తి నష్టాన్ని అంచనా వేయడానికి ఉన్నత స్థాయి దర్యాప్తును ప్రారంభించారు.

 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)