Breaking News

పుతిన్ శత్రువుపై మరిన్ని కేసులు.. ఎంత కాలం శిక్ష పడనుందో తెలుసా?

Published on Fri, 08/04/2023 - 13:28

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు బద్ధ శత్రువైన ప్రతిపక్ష నాయకుడు అలెక్సి నవాల్నీని తీవ్రవాదంతో సహా అనేక నేరాలపై ఇప్పటికే జైలు శిక్షను అనుభవిస్తున్నారు. తీవ్రవాదిగా ప్రకటించబడిన ఆయన పదకొండున్నర సంవత్సరాల జైలు శిక్షలో భాగంగా జనవరి 2021 నుండి శిక్షను అనుభవిస్తుండగా తాజాగా ఆయనపై మరిన్ని అభియోగాలను మోపి అతడి జైలుశిక్షను మరింత పొడిగించనున్నాయి క్రెమ్లిన్ వర్గాలు. 

ప్రాసిక్యూటర్లు అలెక్సి నవాల్నీపై మోపబడిన అదనపు కేసులు.. తీవ్రవాద సంస్థ ఏర్పాటు, నాజీ మద్దతుదారులకు పునరావాసం, తీవ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా రెండు బహిరంగ సభలు, ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా నవాల్నీ అవినీతి నిరోధక నిధి పేరిట మరో సంస్థను స్థాపించడం, మైనర్లను ఉగ్రవాదం వైపు నడిపించడం (నవాల్నీ సభలకు 18 సంవత్సరాల లోపు వారు హాజరైనందుకు), తీవ్రవాదానికి ఆర్ధికంగా ఊతమిచ్చేందుకు నిధులు సేకరించడం వంటి అభియోగాలను మోపారు. 

కొత్తగా నమోదైన కేసుల విషయమై నవాల్నీ స్పందిస్తూ ప్రజా జీవితానికి నన్ను దూరంగా ఉంచాలన్న కారణంతోనే మరిన్ని కేసులు మోపి మరో 20 ఏళ్ళ పాటు  జైల్లోనే మగ్గిపోయేలా చేయాలని పుతిన్ నేతృత్వంలోని క్రెమ్లిన్ వర్గాలు చూస్తున్నాయన్నారు. తనను తీవ్రవాదిగా చిత్రీకరించి మొత్తంగా 35 ఏళ్ల జైలు శిక్ష విధించాలన్నదే రష్యా అధ్యక్షుడి అభిమతమని అన్నారు. 

జైల్లో ఉన్నా కూడా తన సోషల్ మీడియా ద్వారా అనుచరుల సాయంతో ఎప్పటికపుడు యాక్టివ్ గా ఉంటారు నవాల్నీ. కొత్త అభియోగాల విషయంలో క్రెమ్లిన్ పన్నుతున్న కుట్రను కూడా ఆయన సోషల్ మీడియాలో పొందుపరిచారు. స్వేచ్ఛతో కూడిన కొత్తదైన ధనిక రాజ్యానికి జన్మనివ్వాలంటే ప్రతి ఒక్కరూ అలాంటి రాజ్యం కోసం త్యాగం చేసి తల్లిదండ్రులు కావాలని కోరారు. 

ఇది కూడా చదవండి: మెక్సికోలో ఘోరం.. లోయలో పడిన బస్సు.. మృతుల్లో భారతీయులు

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)