Breaking News

ట్రంప్‌ గెలుపుపై పుతిన్‌ రియాక్షన్‌ ఇదే

Published on Fri, 11/08/2024 - 07:24

మాస్కో: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన రిప‌బ్లిక‌న్ పార్టీ అధ్య‌క్ష అభ్య‌ర్థి డొనాల్డ్ ట్రంప్‌కు ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు పుతిన్‌ అవునని సమాధానం ఇచ్చారు.  

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు విడుదల తర్వాత గురువారం రష్యాలోని సోచిలో ఓ అంతర్జాతీయ సదస్సు జరిగింది. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో పుతిన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుతిన్‌.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్‌తో చర్చలు జరపడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు.. అందుకు తాను సంసిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

అదే సమయంలో ఏడాది జులైలో ట్రంప్‌పై జరిగిన హత్యా‍యత్నంపై స్పందించారు. హత్యాయత్నం జరిగిన అనంతరం ట్రంప్‌ చూపించిన తెగువ, ధైర్యం తనను ఆకట్టుకుందన్నారు.  

పుతిన్‌తో మాట్లాడలేదు
అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తాను 70 మంది దేశాది నేతలతో మాట్లాడానని ట్రంప్‌ తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమెక్రాటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌ను గెలిపించాలని పిలుపున్చిన పుతిన్‌తో తాను మాట్లాడలేదని ట్రంప్‌ వెల్లడించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)