Breaking News

పాకిస్తాన్‌లో మరో ట్విస్ట్‌.. మాజీ ప్రధాని ఇంటి వద్ద హైటెన్షన్‌!

Published on Fri, 02/17/2023 - 15:34

ఇస్లామాబాద్‌: ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కూరుకుపోయిన దాయాది దేశంలో పాకిస్తాన్‌లో మరో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్‌ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ఖాన్‌ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. 

వివరాల ప్రకారం.. పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు.. లాహోర్‌లోని ఆయన నివాసం వద్దకు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇమ్రాన్‌ ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, పీటీఐ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులకు వ్యతిరేకంగా పీటీఐ నేతలు నినాదాలు చేశారు. 

కేసు ఇదే.. పాకిస్తాన్‌ ఎన్నికల కమిషన్‌ గతేడాది అక్టోబర్‌లో విదేశీ ప్రభుత్వాల నుంచి వచ్చే బహుమతులను పర్యవేక్షించే విభాగం తీరుపై(తోషిఖానా తీర్పు) పీటీఐ నేతలు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. కాగా, దీనిపై ఇమ్రాన్‌ సహా పార్టీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో, ఈ కేసులో ఇమ్రాన్‌ అరెస్ట్‌ కావాల్సి ఉండగా.. గతేడాది నంబరులో వజీరాబాద్‌లో జరిగిన ర్యాలీలో ఇమ్రాన్‌పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. దీంతో, ఈ కేసులో ఇమ్రాన్‌కు బెయిల్‌ ఇచ్చారు. ఈ కేసులో కోర్టు హాజరయ్యేందుకు కొంత సమయం ఇచ్చారు. 

అయితే, కేసులో భాగంగా కోర్టులో హాజరు కాకుండా ఇమ్రాన్‌ జాప్యం చేయడంతో ఇమ్రాన్‌ బెయిల్‌ను రద్దు చేశారు. ఈ క్రమంలో ఇస్లామాబాద్‌లోని యాంటీ టెర్రరిజం కోర్టు (ఏటీసీ) న్యాయమూర్తి రజా జవాద్ అబ్బాస్ మాట్లాడుతూ.. ఇమ్రాన్ ఖాన్‌కు కోర్టు ఎదుట హాజరు కావడానికి ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం. కానీ ఆయన దీన్ని అలుసుగా తీసుకున్నారని ఫైర్‌ అయ్యారు. దీంతో, ఇమ్రాన్‌ను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ ఇంటి వద్ద హైటెన్షన్‌ నెలకొంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)