Breaking News

చోరీకి గురైన వజ్రాభరణాల విలువ రూ.900 కోట్లు !

Published on Thu, 10/23/2025 - 06:36

పారిస్‌: కేవలం 250 సెకన్లలోపే ఫ్రాన్స్‌ రా జ వజ్రాభరణాలను దొంగలు కాజేసిన ఉదంతంలో ఆయా ఆభరణాల మార్కెట్‌ విలువను ఫ్రాన్స్‌ అధికారులు మొదటి సారిగా వెల్లడించారు. అక్టోబర్‌ 19వ తేదీ న పారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత లౌరీ మ్యూజియంలో నెపోలియన్‌ రాజుల కా లంనాటి అపురూపమైన వజ్రాభరణాలు చోరీకి గురైన విషయం తెల్సిందే. దీనిపై 100 మంది పోలీసు, ఇంటెలిజెన్స్‌ అధి కారులు సమగ్రస్థాయిలో కేసు దర్యాప్తు మొదలెట్టిన విషయం తెల్సిందే. 

చోరీ తర్వాత కనిపించకుండా పోయిన వజ్రా భరణాల వివరాలను పారిస్‌ ప్రాసిక్యూ టర్‌ లారే బెకావూ వెల్లడించారు. ‘‘పచ్చ లు, వజ్రాలు పొదిగిన హారం, చెవిదిద్దు లు, 1,354 వజ్రాలు, 56 మరకతమణు లు, పుష్యరాగం పొదిగిన రెండు స్వర్ణ కిరీటాలు, కురులను ఒక దగ్గరకు చేర్చే రెండు పెద్ద పిన్నులు, నీలమణులు, ము త్యాలు, 2,000 వజ్రాలు పొదిగిన నెక్లెస్, మరో పెద్ద ఆభరణాన్ని దొంగలు పట్టుకు పోయారు. 

ఈ ఆభరణాల్లోని నీలమణు లు, వజ్రాలు, బంగారం విడి విలువ ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం దాదాపు రూ.900 కోట్లు ఉండొచ్చు. ఫ్రాన్స్‌ ప్రాచీన ఘన వారసత్వం, రాజరిక హోదా, అరు దైన డిజైన్‌ వంటివి సైతం లెక్కిస్తే వీటి విలువను ఊహించలేం’’ అని అధికారి బెకావూ వ్యాఖ్యానించారు. చోరీ జరిగిన తర్వాత ఎట్టకేలకు బుధవారం మ్యూజి యంను సందర్శకుల కోసం తెరచారు. అయితే చోరీకి గురైన అపోలో గ్యాలరీలోకి మాత్రం ఎవరినీ అనుమతించట్లేరు. 

అయి తే చోరీకి గురైన ఆభరణాల ఆచూకీ కను గొనడం అసాధ్యమని నిపుణులు అంచనావేస్తున్నారు. ‘‘ఇలాంటి చోరీలు చేసే చోరశిఖామణులు అత్యంత తెలివిగా వ్యవ హరిస్తారు. చోర తర్వాత నకిలీ పాస్‌పోర్ట్‌ తో దేశం దాటేస్తారు. చోరీ చేసిన నగలను ముక్కలు చేసి వాటిలోని బంగారం, వజ్రా లు, విలువైన రత్నాలను విడివిడిగా వేర్వే రు వ్యక్తులకు అమ్మేస్తారు. దీంతో అసలు నగ కోసం వెతికే దర్యాప్తు అధికారులకు అవి ఎప్పటికీ దొరకవు’’ అని చోరీ కేసుల ఇన్వెస్టిగేటర్, లాయర్‌ అయిన క్రిస్టఫర్‌ ఏ మ్యారినెల్లో అభిప్రాయపడ్డారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)